Rajiv Bajaj: L&T చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణియన్ ఇటీవల వారానికి 90 గంటలు పనిచేయాలని చేసిన కామెంట్స్ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనికి ముందు ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి సైతం వారానికి యువత 70 గంటలు పనిచేయాలని చేసిన కామెంట్స్ పెద్ద చర్చకుదారితీసిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఇండియాలో వారానికి 48 గంటలు కంటే ఎక్కువ పనిచేయటాన్ని ఓవర్ టైం కింద పరిగణించబడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారాల్లో కూడా పనిచేయటం గురించి సుబ్రహ్మణియన్ మాట్లాడుతూ ఇది పోటీతత్వాన్ని కొనసాగించటంలో దోహదపడుతుందన్నారు. అయితే ఇలాంటి ఆలోచనలు కలిగిన వ్యాపారవేత్తలు ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకారం వారానికి 80-100 గంటలు క్రమం తప్పకుండా పనిచేయటం విజయం సాధించటానికి ఎక్కువగా దోహదపడుతుందని పేర్కొన్నారు.

దీని తర్వాత చైనా అత్యంత సంపన్నుల్లో ఒకరైన అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు వారంలో 6 రోజులు పనిచేయాలన్నారు. దీనిని ఆయన ట్రెమండస్ ఆపర్చునిటీగా పేర్కొన్నారు. తమ కెరీర్ పట్ల మక్కువ ఉన్న వ్యక్తులు ఎక్కువ గంటలు పని చేసే సామర్థ్యాన్ని ఒక ప్రత్యేక హక్కుగా భావిస్తారని అన్నారు. ఇదే క్రమంలో ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ కూడా గతంలో ఇన్ఫోసిస్ మూర్తి 70 గంటల పని కామెంట్లకు సానుకూలంగా కామెంట్స్ చేశారు.
అలాగే క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో సహ వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈవో అదిలి పల్లీచ కూడా వారానికి 80-100 గంటల పనిపై కీలక కామెంట్స్ చేశారు. దీనిలో సగం గంటలు తక్కువ ఒత్తిడితో పనిచేయటం మంచి పనితీరు, రాబడిని ఇస్తుందన్నారు. ఒక స్థాయి తర్వాత డబ్బు ఎంత ఉన్నా ఒక్కటేన్నారు. ఇక పోతే బాంబే షేవింగ్ కంపెనీ సీఈవో సంతనూ దేష్ పాండే మాట్లాడుతూ కెరీర్ ప్రారంభ కాలంలో పనికి ఎక్కువ కాలం కేటాయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే దేశంలో ప్రస్తుతం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి భారీగా చర్చ జరుగుతోంది. ఆదివారం భార్య ముఖం చూస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దంటూ ఎల్ అండ్ టి చైర్మన్ చేసిన కామెంట్స్ మాత్రం పెద్ద చర్చకు దారితీశాయి.
రాజీవ్ బజాజ్ వ్యాఖ్యలు..
90 గంటల పని గురించి జరుగుతున్న తాజా చర్చలో బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్, హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు సమీర్ అరోరా పాల్గొన్నారు. వారానికి 90 గంటల పని సంస్కృతి కావాలంటే ముందు పై స్థాయి నుంచి అది ప్రారంభించండి అని రాజీవ్ బజాజ్ సూచించారు. ఇదే క్రమంలో ఫండ్ మేనేజర్ సమీర్ అరోరా మాట్లాడుతూ సీఈవో కావటానికి కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తి వారానికి 70-90 గంటలు పనిచేయటం అనేది వారి జీవితం, కుటుంబం, ఆరోగ్యం వంటి ఇతర అంశాలతో అనుసంధానించబడి ఉంటుంది. వీటిని మిస్ అయితే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటున్నారు.


Click it and Unblock the Notifications