మార్కెట్‌కు ఆటో, ఫైనాన్స్ ఊతం: దుమ్మురేపిన మారుతీ M&M

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం(అక్టోబర్ 23) లాభాల్లో ముగిశాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తారనే అంచనాలతో ఆసియా మార్కెట్లు లాభాల్లో కదలాడాయి. దీనికి ఆటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు లాభాల్లో పయనించాయి. ప్రధాన షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వంటివి రాణించడం మార్కెట్ లాభాలకు ఊతమిచ్చింది. సెన్సెక్స్ 127.01 పాయింట్లు(0.31%) లాభపడి 40,685.50 వద్ద, నిఫ్టీ 33.90 పాయింట్లు(0.28%) ఎగిసి 11,930.40 వద్ద ముగిసింది. 1,656 షేర్లు లాభాల్లో, 1,019 షేర్లు నష్టాల్లో ముగియగా, 142 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

రిలయన్స్, ఆటో అదుర్స్

రిలయన్స్, ఆటో అదుర్స్

రిలయన్స్‌కు తోడు బ్యాంకింగ్ రంగాలు భారీగా ఎగిశాయి. ఇవి మార్కెట్‌కు ఊతమిచ్చాయి.

మిడ్ క్యాప్ 1 శాతం మేర లాభాలు నమోదు చేశాయి.

నిఫ్టీ బ్యాంకు 6 పాయింట్ల మేర క్షీణించి 24,478 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ సూచీ 135 పాయింట్లు లాభపడి 17,306 వద్ద ముగిసింది.

సెప్టెంబర్ మాసంలో ఆటో సేల్స్ పెరిగాయి. పండుగ సమయంలో సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆటో స్టాక్స్ పుంజుకున్నాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.

అమెరికా ప్యాకేజీ నేపథ్యంలో మెటల్ స్టాక్స్ భారీగా ఎగిశాయి. టాటా స్టీల్ 3 శాతం లాభపడింది.

సిమెంట్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీంతో అల్ట్రా టెక్ సిమెంట్ స్టాక్ 2 శాతం పడిపోయింది.

క్రమంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏవియేషన్ స్టాక్స్ ఎగిశాయి. స్పైస్ జెట్ 9 శాతం పెరిగాయి.

ఆదిత్య బిర్లా ఫ్యాషన్-ఫ్లిప్‌కార్ట్ డీల్ నేపథ్యంలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ స్టాక్ 8 శాతం లాభపడింది.

ఎస్బీఐ కార్డ్ 5 శాతం నష్టపోయింది. బయోకాన్ 3 శాతం పడిపోయింది.

ఆటో, ఫైనాన్స్ ర్యాలీ

ఆటో, ఫైనాన్స్ ర్యాలీ

గతవారం నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ ఈ వారం లాభాల్లో ముగిసింది. గత వారం నష్టాల నుండి సెన్సెక్స్ 1.7 శాతం, నిఫ్టీ 1.4 శాతం కోలుకుంది.

నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 3 శాతం, బ్యాంకింగ్ 4 శాతం లాభపడింది.

ఫైనాన్షియల్, ఆటో స్టాక్స్ ర్యాలీ చేశాయి.

30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 18 లాభాల్లో ముగిశాయి.

రంగాలవారీగా భారీ లాభాల్లో ఆటో ముగియగా, భారీ నష్టాల్లో రియాల్టీ ముగిసింది.

టాప్ గెయినర్స్ జాబితాలో మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్ప్, టాటా మోటార్స్ ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో అల్ట్రా టెక్ సిమెంట్, శ్రీ సిమెంట్స్, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్, గెయిల్ ఉన్నాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

డాలర్ మారకంతో రూపాయి 7 పైసలు క్షీణించి 73.61 వద్ద ముగిసింది.

మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ 3 శాతం లాభపడింది. మారుతీ సుజుకీ 4 శాతం ఎగిసింది.

వారంలో అన్ని రంగాలు అదుర్స్!

వారంలో అన్ని రంగాలు అదుర్స్!

నిఫ్టీ ఆటో 2.93 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.22 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.22 శాతం, నిఫ్టీ ఐటీ 0.51 శాతం, నిఫ్టీ మీడియా 0.69 శాతం, నిఫ్టీ మెటల్ 0.43 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.47 శాతం లాభపడగా, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.04 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.09 శాతం, నిఫ్టీ ఫార్మా 0.37 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.02 శాతం నష్టపోయాయి.

ఈ వారంలో నిఫ్టీ ఫార్మా మినహా అన్ని లాభాల్లో ముగిశాయి.

టీసీఎస్ షేర్ ధర 0.59 శాతం, టెక్ మహీంద్ర షేర్ 1.14 శాతం, మైండ్ ట్రీ స్టాక్ 0.19 శాతం లాభాల్లో ముగిశాయి.

హెచ్‌సీఎల్ టెక్ 1.59 శాతం, ఇన్ఫోసిస్ స్టాక్ 0.59 శాతం, విప్రో స్టాక్స్ 0.58 శాతం, కోఫోర్జ్ స్టాక్స్ 3.54 శాతం నష్టపోయాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+