దేశంలో ఆర్థిక మందగమనం కారణంగా కొనుగోళ్లు తగ్గి దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ అల్లాడుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 'ఆటో ఎక్స్‌పో-2020'పైనే వాహన తయారీదారులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ఆటో ఎక్స్‌పోలో పాల్గొనే విషయంలో పలు ఆటోమొబైల్ కంపెనీలు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.
దీర్ఘకాలిక మందగమనం ఈసారి జరిగే ఆటో ఎక్స్‌పోపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నట్లు ఆటోమొబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆటో ఎక్స్‌పో-2020లో పాల్గొనకపోవడానికి ఆయా కంపెనీలకు వివిధ కారణాలు ఉన్నప్పటికీ, ఈవెంట్ మాత్రం విజయవంతం అవుతుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్) ఆశాభావం వ‍్యక్తం చేస్తోంది.

ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు ‘ఆటో ఎక్స్‌పో'...
వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఆట్టహాసంగా ‘ఆటో ఎక్స్‌పో 2020'ని నిర్వహించనున్నారు. 15వ ఎడిషన్‌గా జరగనున్న ఈ ఎక్స్‌పో ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో ఎక్స్‌పోలలో ఒకటిగా నిలవనున్నట్లు అంచనా. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ ప్రదర్శన జరగనుంది. ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రేటర్ నోయిడా వద్ద 235,000 చదరపు మీటర్ల స్థలంతో సహా 58 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆటో ఎక్స్‌పోను నిర్వహించనున్నారు. దీనిని వీక్షించేందుకు రోజుకు లక్ష మంది వరకు సందర్శకులు రావచ్చని, ఈ ఎక్స్‌పోలో 60కి పైగా కొత్త వాహనాలు విడుదల అవుతాయని భావిస్తున్నారు.

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ‘డుమ్మా'!?
అయితే పలువురు దేశీయ, విదేశీ వాహన తయారీదారులు ఈ ‘ఆటోఎక్స్‌పో-2020'కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటిలో దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారులైన హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా, టీవీఎస్, హోండా కార్స్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్ లిమిటెడ్, ఆడి, బీఎండబ్ల్యూ, ఫోర్డ్, నిస్సాన్, అశోక్ లేలాండ్‌తోపాటు రాయల్ ఎన్‌ఫీల్డ్, హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్ మోటార్ సైకిల్స్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, భారత్ బెంజ్, వోల్వో కార్స్ ఇండియా వంటి కంపెనీలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ కంపెనీలు గతంలో జరిగిన ఈవెంట్‌కు కూడా ‘డుమ్మా' కొట్టడం గమనార్హం.

‘ఎక్స్‌పో'లోకి కొత్తగా మరికొన్ని కంపెనీలు...
ఈసారి ఈ ‘ఆటో ఎక్స్‌పో'లో కొన్ని కొత్త కంపెనీలు కూడా వాటి ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ఎంజీ మోటార్స్, గ్రేట్ వాల్ మోటార్స్, ఫోర్డ్స్ మోటార్స్, కియా మోటార్స్, ఫోక్స్ వాగన్ తదితర కంపెనీలు ఈ ఎక్స్‌పోలో పాలుపంచుకుంటుండగా.. ఇంకా అనేక ఇతర ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీదారులు, స్టార్టప్ కంపెనీలు కూడా పాల్గొననున్నాయి. ఈ ‘ఆటో ఎక్స్‌పో-2020'తో మందగమనం నుంచి ఆటోమొబైల్ రంగం గట్టెక్కుతుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ఆశాభావం వ్యక్తం చేసింది. రోజుకు లక్ష మంది సందర్శకులు ఆటో ఎక్స్‌పో చూసేందుకు రావచ్చని ‘సియామ్' డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుగాటో సేన్ భావిస్తున్నారు.

‘‘ఆ లోటును కొత్త కంపెనీలు భర్తీ చేస్తాయి...''
ఈసారి జరగబోయే ఆటో ఎక్స్‌పోలో దేశీయంగా కొన్ని కంపెనీలు పాల్గొనకపోవచ్చునని, ఈ విషయంలో ఎవరికి వారికి సొంత కారణాలు వుండవచ్చునని, అయితే ఆ లోటును కొత్తగా పాల్గొనబోయే కంపెనీలు భర్తీ చేస్తాయని ఈవెంట్ నిర్వాహకుడు, ‘సియామ్' అధ్యక్షుడు రాజన్ వాధేరా వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఆటో షోల సంఖ్య కూడా తగ్గుతోందనీ, ఫ్రాంక్‌ఫర్ట్, టోక్యో వంటి దేశాల్లో కూడా కంపెనీల భాగస్వామ్యం తగ్గిందనీ ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మందగమనం, ఏప్రిల్ 2020 నుంచి అమలుకానున్న బీఎస్-6 కొత్త ఉద్గార నిబంధనలు, ఇంకా ఇతరత్రా కారణాల దృష్ట్యా ఒక దశలో ఈ ఆటో ఎక్స్‌పో-2020 ఈవెంట్‌ను ఒక సంవత్సరంపాటు వాయిదా వేయాలని కూడా ఆలోచించామని, కానీ చివరికి ఆటో షో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చామని ఆయన తెలిపారు.

‘ఆటో ఎక్స్‌పో'పై అనాసక్తికి కారణాలు ఇవేనా?
ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలు వరుసగా 9 మాసాల్లో క్షీణతను నమోదు చేశాయి. ఇప్పటివరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాల్యూమ్ దాదాపు 16 శాతం క్షీణించింది. ప్రయాణికుల వాహనాలు 18 శాతం, వాణిజ్య వాహనాలు 22 శాతం, ద్విచక్ర వాహనాల 15.7 శాతం క్షీణించడం ఆటో పరిశ్రమలో సంక్షోభానికి ప్రధాన కారణం. దీంతో మారుతి సుజుకి, ఆశోక్ లేలాండ్ కంపెనీలు కొత్త వాహనాల ఉత్పత్తిలో కోత పెట్టడమేకాక తాత్కాలికంగా ప్లాంట్లను సైతం మూసివేశాయి. మరోవైపు వేల సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్వాసన కూడా పలికాయి. ఈ ప్రభావం ఆటో పరిశ్రమల విడిభాగాల కంపెనీలపై కూడా తీవ్రంగా పడింది. దీంతో ఆయా పరిశ్రమలకు చెందిన లక్షలాది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications