For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆటోమేటిక్ చెల్లింపులపై భారీ ఊరట, సెప్టెంబర్ 30 వరకు గడువు

|

రీచార్జీలు, ఓటీటీ, డీటీహెచ్, యుటిలీటీ బిల్లు సహా పలు సేవలకు సంబంధించి ఆటోమేటిక్ రికరింగ్ చెల్లింపులపై వినియోగదారులకు ఆర్బీఐ ఊరట కల్పించింది. ఆటోమేటిక్ చెల్లింపులకు అదనపు ధ్రవీకరణ (AFA) తప్పనిసరి చేసే కొత్త మార్గదర్శకాల అమలును ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వాయిదా వేసింది. ఈ మేరకు ఆర్బీఐ బుధవారం వెల్లడించింది. ఆటోమేటిక్ రికరింగ్ చెల్లింపులకు కస్టమర్ల నుండి అదనపు ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేస్తూ ఆర్బీఐ నూతన మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

మార్చి 31వ తేదీ తర్వాత AFAకు లోబడకుండా కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు, ప్రీపెయిడ్ పేమెంట్ పద్ధతులు, యూపీఐ వినియోగించి చేస్తోన్న చెల్లింపులను నిలిపివేయాలని ఆర్ఆర్‌బీలు, ఎన్బీఎప్‌సీలు, పేమెంట్ పద్ధతులు, యూపీఐ వినియోగించి చేస్తోన్న చెల్లింపులను నిలిపివేయాలని ఆర్ఆర్బీలు, ఎన్బీఎఫ్‌సీలు, పేమెంట్ గేట్‌వేలతో పాటు బ్యాంకులను ఆర్బీఐ గత ఏడాది డిసెంబర్ 4న ఆదేశించింది. కార్డు ట్రాన్సాక్షన్స్ భద్రత, రక్షణ బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

Auto debit facilities to stay, New RBI rule postponed till september 30

కొత్త నిబంధన ప్రకారం రికరింగ్ ఆటోమేటిక్ చెల్లింపుల మొత్తం రూ.5వేలు దాటితే బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు, పేమెంట్ గేట్‌వేల చెల్లింపుదారులకు OTP ద్వారా వారి ఆమోదం తీసుకున్న తర్వాతే ట్రాన్సాక్షన్ పూర్తి చేయాలి. లేదా ఆ చెల్లింపులను అనుమతించరు. అంతకుముందు రూ.2000కు మించి ట్రాన్సాక్షన్‌కు పరిమితం చేయాలని భావించినప్పటికీ, పలు విజ్ఞప్తుల నేపథ్యంలో రూ.5వేలకు పెంచింది.

English summary

ఆటోమేటిక్ చెల్లింపులపై భారీ ఊరట, సెప్టెంబర్ 30 వరకు గడువు | Auto debit facilities to stay, New RBI rule postponed till september 30

In a reprieve for banks and millions of customers, auto debit facilities for payment of bills and subscriptions will stay in place for six more months. The Reserve Bank of India (RBI) has extended the deadline for a rule that would have caused disruptions from tomorrow.
Story first published: Wednesday, March 31, 2021, 18:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X