ఈ చిచ్చర పిడుగు సంపాదన చూసి నోరెళ్లబెట్టాల్సిందే.. 11 ఏళ్లకే మిలియనీర్, 12 ఏళ్లకే రిటైర్మెంట్..
పదకొండేళ్ల అమ్మాయి ఏం చేస్తుంటుంది.. మహా అయితే హై స్కూల్ చదువుతూ ఉంటుంది అనుకుంటాం. ఈ చిచ్చరపిడుగు విషయంలో అది పొరపాటే అవుతుంది. 11 ఏళ్లకే ఓ కంపెనీకి CEOగా మిలియనీర్ల లిస్టులో చేరిపోయింది. తన 12వ బర్త్ డే సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆస్ట్రేలియా చిన్నదాని స్టోరీ ఏంటో తెలుసుకుందాం..
ఆస్ట్రేలియాకు చెందిన 11 ఏళ్ల పిక్సీ కర్టిస్ ఓ మల్టీ మిలియన్ కంపెనీకి CEO. తల్లి రాక్సీ జాసెంకోతో కలిసి 2021లో తన బొమ్మల కంపెనీ పిక్సీస్ ఫిడ్జెట్స్ ని ప్రారంభించింది. కొవిడ్ సంక్షోభ సమయం నుంచి విజయవంతంగా వ్యాపారాన్ని రన్ చేస్తోంది. 2023 నాటికి ప్రతి నెలా లక్షా 33 వేల డాలర్లు కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నట్లు news.com.au వెల్లడించింది.

తన విద్య కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించే ఉద్దేశంతో.. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు పిక్సీ తెలిపింది. తన 12వ పుట్టినరోజును రిటైర్మెంట్ గా జరుపుకోవాలని భావిస్తున్నట్లు చెప్పింది. ఈ పార్టీకి వచ్చే అతిధులకు 50 డాలర్ల విలువైన గిఫ్ట్స్ సిద్ధం చేస్తున్నట్లు ఇంస్టాగ్రామ్ లో ప్రకటించింది.
తనకు మెర్సిడెజ్ బెంజ్ కారు ఉన్నట్లు తెలిపింది. కానీ వయో నిబంధనల వల్ల సొంతగా డ్రైవ్ చేయలేనని పేర్కొంది. ఆమెకు ఇన్స్టాలో లక్షా 30 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ పోస్ట్ పై వారు భిన్నకాలుగా స్పందిస్తున్నారు. బాల్యాన్ని ఎంజాయ్ చేయమని కొందరు సలహాలు ఇస్తుంటే, ఆమె పేరెంట్స్ పై విమర్శలు గుప్పించే వారు మరికొందరు.


Click it and Unblock the Notifications