గతేడాది 2024లో ఆస్ట్రేలియా ఒక కొత్త వీసా విధానాన్ని తీసుకొచ్చింది. ప్రపంచ స్థాయి నిపుణులను, మేధావులను ఆకర్షించేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం నేషనల్ ఇన్నోవేషన్ వీసా (National Innovation Visa) అనే సరికొత్త పర్మనెంట్ రెసిడెన్సీ ప్రొగ్రామ్ ను తీసుకొచ్చింది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తమ దేశంలో నిపుణులను పెంచుకునేందుకు ఆస్ట్రేలియా నేషనల్ ఇన్నోవేషన్ వీసా అనే కొత్త పాలసీని ఆస్ట్రేలియా ప్రభుత్వం 2024 డిసెంబర్ లో మొదలుపెట్టింది. అయితే చాలామందికి ఈ వీసా గురించి అంతగా తెలియదు. ఈ వీసా లభిస్తే ఉద్యోగంతో పాటు ఫ్రీగా పర్మినెంట్ రెసిడెన్సీ కూడా ఇస్తారు. దీంతోపాటు ఉండడానికి ఇల్లు, పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్..ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
వీసా ఎవరి కోసం..
మీలో ఏదైనా గొప్ప ట్యాలెంట్ ఉంటే చాలు. ఈ వీసా ఈజీగా లభిస్తుంది. ఏదైనా వృత్తిలో మీరు నిపుణులు అయినా లేదా పరిశోధనా రంగంలో అద్భుతమైన విజయాలు సాధించినా ఈ వీసాకు అప్లై చేసుకోవచ్చు. అలాగే రకరకాల కళాకారులు, అథ్లెట్లు కూడా ఈ వీసాకు అర్హులే. అయితే ఈ వీసా రావాలంటే మీ టాలెంట్ కు గానూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండాలి. ఏవైనా అవార్డులు, సర్టిఫికేట్లు ఉన్నా సరిపోతుంది. ఇలాంటి వారికి పిలిచి ఫ్రీగా పర్మినెంట్ రెసిడెన్స్ ఇస్తారు.
బెనిఫిట్స్ ఇవే.
ఇదొక పర్మనెంట్ వీసా (Permanent Visa) ప్రోగ్రామ్. అంటే మీరు ఆస్ట్రేలియాలో శాశ్వతంగా నివసించవచ్చు, పని చేయవచ్చు, చదువుకోవచ్చు. ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ పథకంలో కూడా చేరొచ్చు. అలాగే మీ కుటుంబ సభ్యులను కూడా ఇందులో చేర్చుకోవచ్చు.
ఇన్నోవేషన్ వీసా లభిస్తే.. మీకు కొంతకాలం పాటు పర్మినెంట్ రెసిడెన్సీ లభిస్తుంది. మీరు ఒక నాలుగు సంవత్సరాలు చట్టబద్ధంగా ఆస్ట్రేలియాలో నివసిస్తే.. ఆ పైన మీకు ఆస్ట్రేలియా పౌరసత్వం కూడా లభిస్తుంది.
నామినేటర్ ఉండాలి
ఈ వీసా దరఖాస్తులో అత్యంత ముఖ్యమైన భాగం నామినేటర్ కలిగి ఉండటం. అంటే మీరు ఈ వీసాకు అప్లై చేయాలంటే, మీ రంగంలో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న ఒక వ్యక్తి లేదా సంస్థ మీ గురించి సిఫార్సు చేయాలి. అలాగే ఆ నామినేటర్.. ఆస్ట్రేలియా పౌరుడు లేదా సంస్థ అయ్యి ఉండాలి లేదా ఆస్ట్రేలియా/న్యూజిలాండ్ పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలి.
అప్లికేషన్ ప్రాసెస్
మీరు ఈ వీసాకు నేరుగా అప్లై చేయడానికి వీలు లేదు. అప్లై చేయాలంటే ముందుగా నామినేటర్ ఉండాలి. ఆ తర్వాత ఆస్ట్రేలియా హోం అఫైర్స్ డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో తమ వివరాలతో EOI (Expression of Interest)) ని సమర్పించాలి. ఇది మొదటి స్టెప్. ఆ తర్వాత మీ EOI తో డిపార్ట్‌మెంట్ సంతృప్తి చెందితే మీకు అధికారికంగా దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం పంపుతుంది. ఆ ఇన్విటేషన్ అందిన తర్వాత దరఖాస్తుదారులు 60 రోజుల్లోగా అవసరమైన పత్రాలు (అవార్డులు, ప్రచురణలు, పేటెంట్లు, మీడియా కవరేజ్) వంటివి జతచేసి దరఖాస్తు సమర్పించాలి. వీటిని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదిస్తే మీకు వీసా లభిస్తుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications