Multibagger Stock: భారతదేశంలో ప్రస్తుతం ఐటీ కంపెనీల హవా నడుస్తోంది. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తూ ఇన్వెస్టర్లపై ధన వర్షం కురిపిస్తున్నాయి.
ఐటీ రంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న Aurionpro సొల్యూషన్స్ లిమిటెడ్ స్టాక్ గడచిన మూడేళ్లలో 1,800% పైగా లాభపడ్డాయి. మల్టీబ్యాగర్ ఐటి స్టాక్ జూలై 17, 2020న రూ.51 వద్ద ఉంది. అయితే ప్రస్తుతం ఎన్ఎస్ఈలో స్టాక్ ధర రూ.990 వద్ద ట్రేడింగ్ ముగించింది. గడచిన మూడేళ్ల కాలంలో స్టాక్ సెన్సెక్స్ సూచీ కంటే అధిక రాబడిని అందించింది.

మూడేళ్ల కిందట ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీలో రూ.లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. ఇప్పుడు మార్కెట్ విలువ ప్రకారం పెట్టుబడి విలువ రూ.19 లక్షల కంటే ఎక్కువ రాబడిని పొంది ఉండేవారు. టెక్నికల్స్ ప్రకారం ఏడాది కాలంలో చాలా ఎక్కువ అస్థిరతను సూచిస్తోంది. IT సేవల కంపెనీ స్టాక్ ఈ సంవత్సరం 184.60%, గత మూడు నెలల్లో 183% లాభపడింది. సోమవారం బీఎస్‌ఈలో ఓరియన్‌ప్రో సొల్యూషన్స్ మార్కెట్ క్యాప్ రూ.2,311.83 కోట్లుగా ఉంది.
మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.25.08 కోట్లుగా ఉంది. ఇది అంకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే 32.21 శాతం అధికం. 2023 మార్చి త్రైమాసికంలో అమ్మకాలు 38.69% పెరిగి రూ.190.66 కోట్లకు చేరుకున్నాయి. మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో నిర్వహణ లాభం అంతకు ముందు ఏడాది కంటే 33.69% పెరిగి రూ.40.44 కోట్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 37.72% పెరిగి రూ.97.33 కోట్లకు చేరుకుంది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications