Aurinopro Solutions: కొత్త ఆర్థిక సంవత్సరంలో మెుదటి త్రైమాసిక ఫలితాలను కంపెనీలు ప్రకటించేందుకు సిద్ధమౌతున్న వేళ ఇన్వెస్టర్లు సైతం కొత్త ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉచితంగా బోనస్ షేర్లను అందించే కంపెనీలపై బెట్టింగ్ వేసేందుకు డబ్బు కూడబెడుతున్నారు.
ఈ క్రమంలో స్టాక్ మార్కెట్‌లో బోనస్ షేర్లపై పందెం కాసే పెట్టుబడిదారులకు Aurionpro Solutions Ltd కంపెనీ శుభవార్త తెలిపింది. కంపెనీ తన షేర్ హోల్డర్లకు ఉచితంగా షేర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు మరో షేరును అందించాలని బోర్డ్ నిర్ణయించింది. జూన్ 30కి ముందు బోనస్ ఇష్యూకి సంబంధించిన రికార్డ్ డేట్ అని బెట్టింగ్ వేయాలనుకునే ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి.

రికార్డు తేదీ వివరాలు:
పెట్టుబడిదారులకు 1 షేరుపై 1 షేర్ బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు స్టాక్ మార్కెట్లకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. ఇందుకోసం కంపెనీ జూన్ 27ని రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేసింది. అంటే ఈ తేదీ నాటికి కంపెనీ పుస్తకాల్లో షేర్లను కలిగి ఉండే వ్యక్తులు ఉచితంగా అందిస్తున్న షేర్లను పొందేందుకు అర్హులని గుర్తుంచుకోండి. మీరు కూడా ఈ బోనస్ షేర్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే రికార్డ్ తేదీ కంటే ముందే షేర్‌లను కొనుగోలు చేయండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కంపెనీ మొదటిసారిగా బోనస్ షేర్లను ఇస్తోంది.
శుక్రవారం కంపెనీ షేర్లు 0.62 శాతం లాభంతో రూ.2686.05 వద్ద ముగిశాయి. గత ఏడాది కాలంలో కంపెనీ షేర్ల ధరలు 169 శాతానికి పైగా పెరిగాయి. అంటే పొజిషనల్ ఇన్వెస్టర్ల డబ్బు ఈ కాలంలో రెండింతలు పెరిగింది. అలాగే గడచిన 6 నెలల్లో Aurionpro Solutions షేర్ ధరలు 35 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. బీఎస్ఈలో కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.2799 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.900గా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ మెుత్తంగా రూ.7415.32 కోట్ల వద్ద కొనసాగుతోంది.
ఇన్వెస్టర్లకు ఇదొక డివిడెండ్ పేయింగ్ స్టాక్ అని గుర్తుంచుకోవాలి. క్రమమైన వ్యవధిలో కంపెనీ తన పెట్టుబడిదారులకు డివిడెండ్ చెల్లిస్తూనే ఉంది. చివరి సారిగా ఒక్కో షేరుపై రూ.2.5 డివిడెండ్ అందించింది.


Click it and Unblock the Notifications