GST collection: ఆగస్టులో జీఎస్టీ కళ్లు చెదిరే వసూళ్ల.. కొత్తగా లక్కీ డ్రా స్కీమ్ ..
GST collection: ప్రతిసారి జీఎస్టీ వసూళ్ల సంఖ్యలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో చిన్న వ్యాపారాలను సైతం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం, పెరుగుతున్న స్టార్టప్ వ్యవస్థ, కొత్తగా పెరుగుతున్న వ్యాపారాల సంఖ్య వంటి అంశాలు దీనికి దోహదపడుతున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 2023లో జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగాయని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం జూలై నెల జీఎస్టీ వసూళ్లు రూ.1,65,105 కోట్లుగా నమోదయ్యాయి. గత నెలలో మాదిరిగానే వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 11 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు మల్హోత్రా తెలిపారు.

గత ఏడాది ఇదే నెలలో జీఎస్టీ వసూలు ఆదాయాల కంటే జూలైలో వచ్చిన ఆదాయాలు కూడా 11 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(GST) నుంచి 2022 ఆగస్టులో రూ.1,43,612 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. అలాగే జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉందని, నామమాత్రంగా 8 శాతం పెరిగిందని మల్హోత్రా చెప్పారు.
కేంద్రం ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీఎస్‌టీ లక్కీ డ్రా 'మేరా బిల్ మేరా అధికార్' పథకాన్ని శుక్రవారం ప్రారంభించింది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రివార్డ్ స్కీమ్ కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.30 కోట్ల కార్పస్‌ను కేటాయించాయి. 'మేరా బిల్ మేరా అధికార్' జీఎస్టీ లక్కీ డ్రాను ఆరు రాష్ట్రాల్లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభిస్తున్నామని, ప్రైజ్ మనీని కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమానంగా జమచేస్తాయని రెవెన్యూ కార్యదర్శి మల్హోత్రా శుక్రవారం తెలిపారు.


Click it and Unblock the Notifications