GST News: నిర్మలమ్మ గల్లాపెట్టికి భారీగా సొమ్ము.. ఆగస్టులో భారీగా జీఎస్టీ కలెక్షన్స్..
August GST Collection: మోదీ సర్కార్ వ్యాట్ స్థానంలో ప్రవేశపెట్టిన జీఎస్టీ బంపర్ రాబడులను తెచ్చిపెడుతోంది. జీఎస్టీ ఎగవేతను అరికట్టేందుకు పన్ను శాఖ టెక్నాలజీని విరివిగా వినియోగించటంతో పాటు చట్టాలను కఠినతరం చేయటం కేంద్రానికి డబ్బుల వర్షం కురిపిస్తోంది.
తాజాగా ప్రభుత్వం ఆగస్టు 2024కి సంబంధించిన జీఎస్టీ వసూళ్ల గణాంకాలను ప్రకటించింది. ఈ క్రమంలో గడచిన నెలలో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ వసూళ్లు మెుత్తంగా 10 శాతం పెరిగి రూ.1.75 లక్షల కోట్లుగా నమోదైనట్లు వెల్లడైంది. అయితే ఇది ఆగస్టు 2023తోని రూ.1.59 లక్షల కోట్లతో పోల్చినప్పుడు అధికమని కంపెనీ వెల్లడించింది. అయితే జూలై 2024లో జీఎస్టీ వసూళ్లు 1.82 లక్షల కోట్ల కంటే ఆగస్టులో నమోదైన మెుత్తం వసూళ్లు తక్కువగా ఉన్నాయి.

ఆగస్టు 2024లో దేశీయ జీడీపీ ఆదాయం 9.2% వృద్ధి చెంది దాదాపు రూ.1.25 లక్షల కోట్లకు చేరుకుంది. వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 12.1% పెరిగి రూ.49,976 కోట్లకు చేరుకుంది. ఈ నెలలో జారీ చేయబడిన రీఫండ్‌లు మొత్తం రూ.24,460 కోట్లుగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 38% పెరిగింది. రీఫండ్‌లను లెక్కించిన తర్వాత నికర GST ఆదాయం 6.5% పెరిగి నెలకు రూ.1.5 లక్షల కోట్లకు చేరుకుంది.
రాష్ట్రాల వారీగా వసూళ్లు..
ఆగస్టు నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్లును రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే.. ముందు వరుసలో నిలిచిన మహారాష్ట్ర అత్యధికంగా రూ.26,367 కోట్లు జీఎస్టీని వసూలు చేయగా, రెండవ స్థానంలో ఉన్న కర్ణాటక రూ.12,344 కోట్లు, మూడో స్థానంలో ఉన్న గుజరాత్ రూ.10,344 కోట్ల వసూళ్లను చూశాయి. ఇక తర్వాతి స్థానంలో నిలిచిన తమిళనాడు రూ.10,181 కోట్లు, హర్యాణా రూ.8,623 కోట్ల వసూళ్లను నమోదు చేశాయి.


Click it and Unblock the Notifications