Best Credit Card: అనేక క్రెడిట్ కార్డుల ప్రయోజనాలు ఒక్క దానిలోనే.. ఎంపిక కస్టమర్ చేతుల్లోనే..
Credit Card: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. AU బ్యాంక్ LIT (లైవ్-ఇట్-టుడే) పేరుతో క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది కస్టమర్‌లు తమ కార్డ్‌లో వారికి కావలసిన ఫీచర్‌లను ఎంచుకోవడానికి, ఆ ఫీచర్లను వారు కోరుకునే కాల వ్యవధిని కూడా నిర్ణయించుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే వివిధ అవసరాల కోసం అనేక రకాల కార్డులకు బదులుగా ఒకే కార్డులో కావలసిన ఫీచర్లను పొందాలనుకునే వినియోగదారులకు ఈ కార్డు సరైన ఎంపిక కానుంది.
ఒకే కార్డులో అనేక కార్డుల ఫీచర్స్..
ప్రయాణం, షాపింగ్ మొదలైన వివిధ అవసరాల కోసం బహుళ కార్డ్‌లను మెయింటెన్ చేయటానికి బదులుగా.. కస్టమర్ ఈ ఆఫర్ కింద తనకు అవసరమైన క్యాటగిరీలను ఎంచుకోవచ్చని బ్యాంక్ వెల్లడించింది. పైగా కస్టమర్లు కోరుకున్నప్పుడు ఈ ఫీచర్లలో దేనినైనా మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. ఒకే కార్డులో కస్టమర్లు తమకు అవసరమైన అన్ని రకాల ఫీచర్లను కలిగి ఉండేందుకు తమ కార్డు ఎంతగానో ఉపకరిస్తుందని కంపెనీ తెలిపింది. కస్టమర్లు అవసరమైన ఫీచర్లను ఎంచుకునే అధికారాన్ని బ్యాంక్ వారి చేతుల్లోనే పెట్టిందని తెలిపింది. వివిధ కంపెనీలు అనేక రకాల మంచి ఆఫర్లు కలిగిన కార్డులను అందిస్తున్నప్పటికీ.. అందుకోసం వినియోగదారులు ఒకటి కంటే ఎక్కువ కార్డులను కలిగి ఉండాల్సి వస్తుందని ఈ సందర్భంగా బ్యాంక్ అభిప్రాయపడింది.

ఆప్షన్ల ఎంపిక ఇక ఈజీ..
వినియోగదారులు చిన్న సౌలభ్యం రుసుముతో నిజ సమయంలో ఏదైనా ఫీచర్‌ని యాక్టివేట్ చేయవచ్చు. ప్రతి ఫీచర్‌కి డిఫాల్ట్ చెల్లుబాటు వ్యవధి 90 రోజులుగా ఉంటుంది. ఇంకా, కార్డ్ హోల్డర్లు AU0101 అప్లికేషన్ కార్డ్‌డాన్ ద్వారా చేసిన లావాదేవీల నుంచి వారు పొందిన ఆర్థిక ప్రయోజనాలను ట్రాక్ చేసుకోవచ్చు. LIT క్రెడిట్ కార్డ్ త్రైమాసికానికి ఒకటి లేదా రెండు లాంజ్ యాక్సెస్ (కస్టమర్ ఎంచుకోవాలి), మైలురాయి ప్రయోజనాలు, వివిధ OTT, జీవనశైలి సర్వీసెస్ ఫ్రీ మెంబర్ షిప్, ఆన్‌లైన్, POS లావాదేవీలకు అధిక రివార్డ్ పాయింట్లు, ఇతర చిన్న రివార్డ్‌లతో సహా ఐదు రకాల ఫీచర్లను అందిస్తుంది. ఇంధన సర్‌చార్జ్ మినహాయింపు, కిరాణాపై క్యాష్‌బ్యాక్ వంటి ఇతర ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తమ సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ MD,CEO సంజయ్ అగర్వాల్ అన్నారు.


Click it and Unblock the Notifications