ఆంగ్ల కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. కొత్త నెల లేదా కొత్త సంవత్సరంలో కొత్త కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంకింగ్ సెక్టార్‌కు సంబంధించిన కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో ఒకటి- ఏటీఎం నగదు విత్ డ్రా ఛార్జీల పెరుగుదల. ఉచిత పరిమితిని దాటి ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునే ప్రతి నగదు లావాదేవీలపైనా వసూలు చేసే సర్వీసు ఛార్జీలను బ్యాంకులు పెంచాయి. జనవరి 1వ తేదీ నుండి ఇవి అమల్లోకి వచ్చాయి.
ఏటీఎం ఉపసంహరణ ఛార్జీలను పెంచాలని కోరుతూ బ్యాంకులు దాఖలు చేసిన ప్రతిపాదనలపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ప్రతి నెలా ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని మించితే కస్టమర్ల నుంచి ఇప్పటిదాకా వసూలు చేసే సర్వీసు ఛార్జీలను బ్యాంకులు పెంచుకోవచ్చని స్పష్టం చేసింది. అధిక ఛార్జీలను వసూలు చేసుకోవడానికి బ్యాంకులకు అనుమతిచ్చింది. 2022 జనవరి 1 నుంచి ఇది అమలు అవుతుందని ఇదివరకే పేర్కొంది. అన్ని జాతీయ, ప్రైవేటు బ్యాంకులకు దీన్ని వర్తింపజేసింది.

రిజర్వుబ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా.. 2022 జనవరి 1 నుంచి ఏటీఎంలల్లో ఉచిత పరిమితి కంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలు చేస్తే రూ.21 బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ప్రతి బ్యాంక్ నెలకు గ్రామీణ ప్రాంతాల్లో అయిదు, నగరాల్లో మూడు ఉచిత లావాదేవీలను నిర్వహించడానికి వినియోగదారులకు అనుమతి ఇచ్చింది. ఈ పరిమితికి మించి ఏటీఎంల నుంచి నగదు మొత్తాన్ని విత్ డ్రా చేసే ప్రతీసారీ ఒక్కో లావాదేవీపై అదనంగా 20 రూపాయలను వసూలు చేస్తోన్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications