ఏటీఎం విత్ డ్రా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం త్వరలో భారం కానుందా? అంటే కావొచ్చునని అంటున్నారు. క్యాష్ విత్‌డ్రాపై ఇంటర్‌ఛేంజ్ ఫీజు పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్స్ అసోసియేషన్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి లేఖ రాసింది. ఇందుకు ఆర్బీఐ కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

ఛార్జీలు పెంచండి..
ఇప్పటికే దేశంలో ఏటీఎంల సంఖ్య తగ్గుతోంది. ఈ ఛార్జీలు పెంచితే ఈ ప్రభావం మరింతగా పడే అవకాశాలు ఉన్నాయి. భద్రత, నిర్వహణపై ఆర్బీఐ నిబంధనలు ఖర్చులు పెంచేలా చేశాయి. అయితే ఆ కంపెనీలకు వస్తున్న ఆదాయం మాత్రం పెరగలేదు. దీంతో ఏటీఎం ఆపరేటర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఛార్జీలు పెంచకుంటే దెబ్బతింటామని పేర్కొంటున్నాయి.

ఉచిత ట్రాన్సాక్షన్స్ దాటితే..
ప్రస్తుతం ఒక బ్యాంకు కార్డును వేరే బ్యాంకుకు చెందిన ఏటీఎం సెంటర్‌లలో వినియోగిస్తే సదరు ఏటీఎం ఆపరేటర్‌కు ఖాతాదారు ఇంటర్‌చేంజ్ ఫీజును చెల్లించాలి. కస్టమర్లకు ఆయా బ్యాంకులను బట్టి 5 వరకు ఉచిత ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత చేసే ట్రాన్సాక్షన్స్‌కు ఫీజు ఉంటుంది.

ప్రస్తుతం రూ.15 ఛార్జ్...
పరిమితి దాటిన తర్వాత చేసే నగదు విత్‌డ్రా పైన రూ.15, బ్యాలెన్స్ ఎంక్వయిరీ లేదా ఇతర నగదు రహిత ట్రాన్సాక్షన్స్‌కు రూ.5 చొప్పున ఛార్జీ వసూలు చేస్తాయి. నగదు విత్ డ్రా పరిమితిని ఆర్బీఐ రూ.15 గరిష్టంగా ఉండేలా గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు దీనిని పెంచాలని కోరుతున్నారు.

బిజినెస్ ఖర్చులు పెరిగాయి...
వివిధ కారణాలతో ఏటీఎం బిజినెస్ ఖర్చులు పెరిగాయని ఫిబ్రవరి 13న ఆర్బీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏటీఎంల నిర్వహణ ఖర్చు పెరిగి, వ్యాపారాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల కొత్త ఏటీఎంలను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నామని తెలిపారు. అందుకే ఆదాయాన్ని పెంచాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

ఫీజులు పెంచాలని సిఫార్సు
ఏటీఎం వినియోగం, వ్యాప్తిని పెంచేందుకు ప్రతిపాదనల కోసం గత ఏడాది ఆర్బీఐ ఓ ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ఈ కమిటి గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రతిపాదలను ఆర్బీఐకి సమర్పించింది. ఇంటర్ ఛేంజ్ ఫీజులను పెంచాలని సిపార్సు చేసినట్లుగా తెలుస్తోంది.

పట్టణ ప్రాంతాల్లో ఎంత పెరగొచ్చు
పది లక్షల మంది ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్ ఫీజు రూ.17కు పెంచాలని, నగదు రహిత ట్రాన్సాక్షన్స్‌ను రూ.7కు పెంచాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అలాగే, ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌ను 3గా చేయాలని సూచించింది.

ఇతర ప్రాంతాల్లో ఎంత పెరగొచ్చు
10 లక్షల కంటే తక్కువ జనాభా ఉండే రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్ ఫీజు రూ.18, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు రూ.8 వసూలు చేయాలి సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక ఉచిత ట్రాన్సాక్షన్స్ 6గా ఉండేలా చూడాలని సూచించింది.

ఆర్బీఐ ఓకే చెప్పే అవకాశం
ప్రస్తుతం ఈ ప్రతిపాదలను ఆర్బీఐ పరిశీలిస్తోంది. దాదాపు కాస్త అటు ఇటుగా ఏటీఎం ఆపరేటర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చునని భావిస్తున్నారు. అదే జరిగితే ఖాతాదారుడిపై అదనపు భారం పడుతుంది. ఆర్బీఐ డేటా ప్రకారం దేశంలో 2,27,000 ఏటీఎంలు ఉన్నాయి. 21,300 వైట్ లేబుల్ మిషన్స్ ఉన్నాయి. మిగతావి బ్యాంకులకు చెందినవి.

గ్రామీణ భారతంలో ఏటీఎంలు...
ప్రతి 5 ఏటీఎం సెంటర్‌లలో ఒకటి మాత్రమే రూరల్ ప్రాంతంలో ఉందని డేటా వెల్లడిస్తోంది. ప్రయివేటు సెక్టార్ బ్యాంక్స్ విషయానికి వస్తే ప్రతి 10 ఏటీఎంలకు ఒకటి కంటే తక్కువగా ఉంది.

తక్కువ ఏటీఎంలు..
ఏటీఎం ఆపరేషన్స్ భారత్‌లో చాలా తక్కువగా ఉంది. చైనా, అమెరికా, జర్మనీ, బ్రెజిల్, సౌతాఫ్రికాలలో తలసరి ఏటీఎం విస్తరణ రేటు 2,000 లోపు ఉంటే, భారత్‌లో 2017 నాటికి 5,919గా ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications