మీ జేబులో ఏటిఎం కార్డు ఉంటే మీకు అవసరమైనప్పుడు క్యాష్ విత్ డ్రా తీసుకోవచ్చు. కానీ మే 1 నుండి ATM నుండి క్యాష్ విత్ డ్రా చేయడానికి రూల్స్ మారబోతున్నాయి. దింతో మే 1 నుండి ATM విత్ డ్రాలు చేస్తే చార్జీల మోత మోగనుంది. ఏటీఎం ఛార్జీల పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా ఆమోదం తెలిపింది. RBI ఆమోదం తర్వాత పెరిగిన ఛార్జీలు వచ్చే నెల అంటే మే 1 నుండి వర్తిస్తాయి. HDFC బ్యాంక్, PNB బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి బ్యాంకులు ఇప్పటికే కస్టమర్లకు దీని గురించి తెలియజేశాయి.

ఫ్రీ లిమిట్ తర్వాత మీరు ATM నుండి డబ్బు తీసుకుంటే, ఇంతకుముందు కంటే ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ కస్టమర్లకు ప్రతి నెలా 5 ఉచిత ట్రాన్సక్షన్ అందిస్తుంది. మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకుల ATMల నుండి 3 ఫ్రీ ట్రాన్సక్షన్, మెట్రో నగరాల్లో 5 ఫ్రీ ట్రాన్సక్షన్ చేసుకోవచ్చు, కానీ ఈ లిమిట్ తర్వాత మీరు ATM నుండి విత్ డ్రా చేస్తే ఎక్కువ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. చాలా కాలంగా ఏటీఎం ఛార్జీలు పెంచాలనే డిమాండ్ ఉంది. ATM నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ట్రాన్సక్షన్ చార్జెస్
పెరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) RBIకి ఛార్జీలను పెంచాలని సిఫార్సు చేసింది, దీనికి ఇప్పుడు ఆమోదం లభించింది.
చార్జెస్ ఎంత అంటే: మే 1 తర్వాత మీరు ATM నుండి ఫ్రీ లిమిట్ కంటే ఎక్కువసార్లు విత్ డ్రా చేస్తే మీపై భారం పెరుగుతుంది. ఇప్పటివరకు, ఫ్రీ లిమిట్ తర్వాత ప్రతి ఒక ATM ట్రాన్సక్షన్ పై రూ.21 చార్జెస్ చెల్లించాల్సి ఉండేది, కానీ మే 1 నుండి ఒక్కో ట్రాన్సక్షన్ రూ.23కి పెంచారు. అంటే మే 1 నుండి, ప్రతి ఎక్సట్రా ట్రాన్సక్షన్ పై రూ.2 పెరిగింది.
ATM ఫ్రీ ట్రాన్సక్షన్ లిమిట్ ఎన్ని : ఫ్రీ ట్రాన్సక్షన్ పరిమితిలో ఆర్‌బిఐ ఎటువంటి మార్పు చేయలేదు. కానీ మీ బ్యాంకు ATM నుండి 5 ట్రాన్సక్షన్, మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకు ఏటీఎం నుండి 3 ఉచిత ట్రాన్సక్షన్ ఇంకా మెట్రోయేతర నగరాల్లో 5 ఉచిత ట్రాన్సక్షన్ సౌకర్యం ఉంటుంది. ATM ఛార్జీల పెరుగుదల చిన్న బ్యాంకుల కస్టమర్లపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. దింతో చిన్న బ్యాంకుల కస్టమర్లపై కాస్త భారం పడనుంది, ఎందుకంటే ఈ బ్యాంకులకు తక్కువ ATMలు ఉన్నాయి అలాగే పెద్ద బ్యాంకుల నెట్‌వర్క్‌పై ఆధారపడుతుంటాయి.


Click it and Unblock the Notifications