For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ATM Cash Withdrawal: మారుతున్న ATM క్యాష్ విత్ డ్రా ప్రక్రియ.. స్టేట్ బ్యాంక్ హెచ్చరిక.. మీరూ తెలుసుకోండి..

|

ATM Cash Withdrawal: భారత బ్యాంకింగ్ దిగ్గజం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మోసపూరిత లావాదేవీల నుంచి తన వినియోగదారులను రక్షించడానికి ATMలలో వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) ఆధారిత క్యాష్ విత్ డ్రా పద్ధతిని తీసుకొచ్చే పనిలో ఉంది. అనధికారిక లావాదేవీల ద్వారా నష్టం కలగకుండా భద్రత కోసం కొత్త విధానాన్ని బ్యాంకు తీసుకొస్తోంది. దేశంలోని దిగ్గజ బ్యాంకులు సైతం ఈ కొత్త పద్ధతిలోకి మారేందుకు సిద్ధమౌతున్నాయి.

డబ్బు విత్ డ్రా కు ఓటీపీ..

డబ్బు విత్ డ్రా కు ఓటీపీ..

కొత్త విధానం ద్వారా లావాదేవీని పూర్తి చేయడానికి SBI కస్టమర్లు ఇప్పుడు ATMలలో డబ్బును విత్ డ్రా చేసుకునే సమయంలో 4-అంకెల వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. ఆ తరువాత సిస్టమ్ జనరేట్ చేసిన OTP కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది. ఈ OTP ఎంటర్ చేయటం ద్వారా నగదు ఉపసంహరణ ధృవీకరించబడుతుంది. ఈ ఓటీపీ కేవలం ఒక్క లావాదేవీకి మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

ఎంత దాటితే ఏటీపీ తప్పనిసరి..?

ఎంత దాటితే ఏటీపీ తప్పనిసరి..?

SBI జనవరి 1, 2020న OTP ఆధారిత నగదు ఉపసంహరణ సేవలను ప్రారంభించింది. అప్పటి నుంచి సేవను పొందాలని కస్టమర్లందరినీ విజ్ఞప్తి చేస్తోంది. బ్యాంక్ సోషల్ మీడియా, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ATM మోసాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే ఉంది. లావాదేవీని పూర్తి చేయడానికి SBI కస్టమర్‌లు ATMలలో ఒక లావాదేవీలో రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే OTP అవసరమౌతుంది.

OTP ఉపయోగించి నగదు ఉపసంహరించుకోవడం ఎలా:

OTP ఉపయోగించి నగదు ఉపసంహరించుకోవడం ఎలా:

1. నగదు విత్‌డ్రా చేసుకునేటప్పుడు కస్టమర్ తమ డెబిట్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో కూడిన మొబైల్ ఫోన్‌ని కలిగి ఉండాలి.

2. కస్టమర్ డెబిట్ కార్డ్‌ను ఇన్‌సర్ట్ చేసి, విత్‌డ్రా మొత్తంతో పాటు ATM పిన్‌ను నమోదు చేసిన తర్వాత OTPని అడుగుతుంది

3. కస్టమర్లు SMS ద్వారా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTPని అందుకుంటారు

4. కస్టమర్ ATM స్క్రీన్‌పై మెుబైల్ నంబర్ కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి

5. కస్టమర్లు చెల్లుబాటు అయ్యే OTPని ఎంటర్ చేయటంతో లావాదేవీ పూర్తవుతుంది

Read more about: sbi atm
English summary

ATM Cash Withdrawal: మారుతున్న ATM క్యాష్ విత్ డ్రా ప్రక్రియ.. స్టేట్ బ్యాంక్ హెచ్చరిక.. మీరూ తెలుసుకోండి.. | ATM Cash Withdrawal Process changing soon by state bank of india and other leading banks to curb frauds know details

Cash Withdrawal Process Likely To Change At ATMs
Story first published: Monday, July 25, 2022, 16:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X