విశాఖపట్నంలో ఈ ప్లాంట్ కారణంగా 600 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఇప్పటికే దేశంలో ఈ కంపెనీకి 5,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్లాంట్‌తో స్థానికంగా ఉద్యోగాలు వస్తాయని యోకోహోమా ఇండియా చైర్మన్, ATG డైరెక్టర్ నితిన్ మంత్రి అన్నారు. ఇప్పటికే ATGకి గుజరాత్‌లోని ధహెజ్‌లో 1.3 లక్ష టన్నుల సామర్థ్యం (రోజుకు 360 టన్నులు), తమిళనాడులోని తిరునల్వేలిలో లక్ష టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్స్ ఉన్నాయి. ఈ కంపెనీకి ఇజ్రాయెల్‌లో 45,000 టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్ కలిగి ఉంది. ఆర్ అండ్ డీ సెంటర్ ఇజ్రాయెల్‌తో పాటు తమిళనాడులో ఉంది.

600 కొత్త ఉద్యోగాలు

మూడు ఆఫ్-హైవే టైర్ బ్రాండ్స్
ఇప్పటికే ఉన్న గుజరాత్, తమిళనాడు ప్లాంట్స్‌లో ATG ముఖ్యమైన మూడు ఆఫ్-హైవే టైర్ బ్రాండు టైర్లను తయారు చేస్తాయి. వ్యవసాయ ఉత్పత్తుల కోసం అలయెన్స్ పేరుతో, నిర్మాణ, పారిశ్రామిక ఉత్పత్తుల కోసం గెలాక్సీ, పేరుతో, అటవీ ప్రాంతాల్లో వినియోగించే వాహనాల కోసం ప్రైమెక్స్ పేరితో టైర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. 90 శాతం ఉత్పత్తిని 120కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. యోకోహామా గ్రూప్‌కు జపాన్, భారత్, ఇజ్రాయెల్, వియత్నాంలలో ఎనిమిది ఆప్-హైవే ప్లాంట్స్ ఉన్నాయి.

విశాఖలో ఆఫ్-హైవే టైర్ల కోసమే..
యోకోహోమా 2016లో ATGని 200 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 3,000 రకాల టైర్లను విక్రయిస్తోంది. మూడో ప్లాంట్ అనువైన ప్రదేశం కోసం చూస్తున్నామని, విశాఖను ఎంచుకున్నామని నితిన్ మంత్రి అన్నారు. పాసింజర్ వెహికిల్స్, కమర్షియల్ వెహికిల్స్ టైర్లను తయారు చేస్తారా అని ప్రశ్నించగా.. ATG ఆఫ్-హైవే బ్రాండ్ టైర్లకే పరిమితమని చెప్పారు. అయితే ధహెజ్‌కు మినహాయింపు ఇచ్చామని, ఇక్కడ భారీ వాహనాల కోసం రేడియల్ టైర్లను తయారు చేస్తామని, కానీ ఈ కొత్త ప్లాంట్ మాత్రం ఆఫ్-హైవే టైర్ల కోసం మాత్రమే అన్నారు.

Click it and Unblock the Notifications