Bonus Multibagger: బోనస్ షేర్లను అందిస్తున్న మల్టీబ్యాగర్.. లక్షను రూ.5 లక్షలు చేసింది..
Bonus Multibagger: అసలు మల్టీబ్యాగర్ స్టాక్స్ దొరకటమే అదృష్టం అంటే పైగా అది బోనస్ షేర్లను సైతం అందించటం అంటే డబుల్ ప్రాఫిట్ వ్యవహారం. అవును చాలా మంది మల్టీబ్యాగర్ స్టాక్స్ కంటపడతాయేమోనని వెతుకుతుంటారు. అలాంటి వారికి ఇవి ఒక వరం అని చెప్పుకోవాలి. ఈ స్టాక్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది స్మాల్ క్యాప్ కంపెనీ అయిన ఆటమ్ వాల్వ్స్ లిమిటెడ్(Atam Valves Ltd) స్టాక్ గురించే. ప్రస్తుతం ఈ మల్టీబ్యాగర్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను అందిస్తోంది. పెట్టుబడిదారులకు 1:1 నిష్పత్తిలో.. అంటే ప్రతి షేరుకు ఒక ఉచిత షేర్ ఇస్తోంది. దీనికి కంపెనీ బోర్డ్ ఆఫ్ డెరెక్టర్లు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది స్టాక్ మెుత్తంగా 468.63 శాతం రాబడిని ఇచ్చింది. ఈ క్రమంలో షేర్ ధర రూ.47 నుంచి రూ.270.10కి చేరుకుంది.

బోనస్ షేర్‌పై కంపెనీ ఏమి చెప్పిందంటే..?
ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను అందించేందుకు ..సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించటానికి రికార్డ్ డేట్ అక్టోబరు 12గా నిర్ణయించింది. సెప్టెంబర్ 30, 2022న జరిగిన AGMలో వాటాదారుల ఆమోదానికి లోబడి నిర్ణయం తీసుకోబడిందని స్పష్టం చేసింది. ప్రస్తుతం మార్కెట్ క్యాప్ రూ.111.42 కోట్లుగా ఉంది. ప్రస్తుతం కంపెనీ ప్లంబింగ్, పారిశ్రామిక వ్యాల్వ్స్ తయారీలో ప్రముఖ కంపెనీగా కొనసాగుతోంది.

షేర్ ధర హిస్టరీ..
అటామ్ వాల్వ్స్ స్టాక్ ధర అక్టోబర్ 9, 2020 నాటికి రూ.40గా ఉంది. గత రెండేళ్ల కాలంలో కంపెనీ 575.25 శాతం పెరిగి ప్రస్తుత మార్కెట్ ధర అయిన రూ.270.10కు చేరుకుంది. అదే విధంగా అక్టోబర్ 1, 2021న కంపెనీ షేర్ ధర రూ.51.50గా ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 3న రూ.47.50గా ఉన్న షేర్ ధర ఏకంగా 468.50 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించింది.


Click it and Unblock the Notifications