Pension News: బంపర్ హిట్ అయిన కేంద్ర ప్రభుత్వ స్కీమ్.. రికార్డు స్థాయిలో ఎన్‌రోల్‌మెంట్స్
APY Scheme: గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రజల్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ పట్ల అవగాహన పెరిగింది. ప్రస్తుతం జీవితంతో పాటు రిటైర్‌మెంట్ తర్వాత లైఫ్ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో ఎవరి దగ్గరా చేయి చాపాల్సిన అవసరం లేకుండా ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ పథకాల ద్వారా ఇందుకు ప్రోత్సహిస్తున్నాయి.
పేదలు సహా తక్కువ వేతన జీవుల కోసం కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పథకం అటల్ పెన్షన్ యోజన (APY)ను ప్రవేశపెట్టింది. జూన్ 20 నాటికి ఈ స్కీమ్‌లో మొత్తం 66.2 మిలియన్ల మంది ఎన్‌రోల్ అయ్యారు. వీటిలో గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించినవి 12.2 మిలియన్ల ఖాతాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ అథారిటీ (PFRDA) చైర్మన్ దీపక్ మొహంతి తెలిపారు.

ఢిల్లీలో జరిగిన APY వార్షిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2015లో పథకం ప్రారంభించినప్పటి నుంచి ఎన్నడూ లేని రేంజ్‌లో గతేడాది అత్యధికంగా నమోదులు జరిగినట్లు వెల్లడించారు. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 70 శాతం కాగా.. గ్రామీణ బ్యాంకులు 20 శాతం ఉన్నట్లు చెప్పారు. వీటి భాగస్వామ్యమే పథకం విజయానికి కారణమని ప్రశంసించారు.
మహిళలు మరియు యువత నుంచి APYకి ఆదరణ బాగా పెరుగుతోందని మొహంతి తెలిపారు. FY24లో జరిగిన మొత్తం ఎన్‌రోల్‌మెంట్‌లలో 52 శాతం మంది మహిళలు ఉన్నారని ప్రకటించారు. సబ్‌స్క్రైబర్‌లలో 70 శాతం మంది 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు పరిధిలో ఉన్నారని వెల్లడించారు. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 10 మిలియన్ల మంది ఎన్‌రోల్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు.


Click it and Unblock the Notifications