Tomato: కిలో టమాటా రూ.250.. హడలిపోతున్న ప్రజలు..
టమాటా ధరలు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. చికెన్ ను దాటి మటన్ వైపు పరుగెడుతున్నాయి. ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో గంగ్రోత్రి ధామ్ లో కిలో టమాటా రూ.250 పలుకుంది. యమునోత్రిలో రూ.200 పలికింది. టమాటా ధరలు చూసిన జనం వణికిపోతున్నారు. కొందరైతే వంటల్లో టమాటా వడడమే మానేశారు. మరికొందరు కిలో కొనే చోట పవు కిలో కొని బండి లాగిస్తున్నారు.
టమాటా ధరలు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే ఉన్నాయి. హైదరాబాద్ లో కిలో టమాటా రూ.90 నుంచి రూ130 వరకు పలుకుతోంది. బెంగళూరులో కిలో టమాటా రూ.101 నుంచి రూ.130 పలుకుతుండగా.. కోల్ కత్తాలో రూ.150, ఢిల్లీలో రూ.120, ముంబైలో రూ.120 పలుకుతున్నాయి. టమాటా ధరలు భారీగా పెరగడంతో రెస్టారెంట్ లు టమాటా వినియోగాన్ని దగ్గిస్తున్నాయి.

మెక్ డొనాల్డ్స్ ఉత్పత్తుల తయారీలో టమోటా వినియోగాన్ని నిలిపివేసింది. ధరలు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. బర్గర్‌ల వంటి అత్యధికంగా అమ్ముడవుతున్న కొన్ని మెక్‌డొనాల్డ్స్ ఉత్పత్తుల్లో టమోటాలు లేకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తోన్నాయి. మెక్ డొనాల్డ్స్ వారు మీకు టమాటా అందించలేమని స్టోర్ ముందు నోటీసు కూడా అతకించింది.
మరోవైపు టమాటా ధరల భారీగా పెరగడంతో కర్ణాటకలో కొందరు దొంగలు టమాటాలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని హసన్ జిల్లాలో గోని సోమనహల్లి గ్రామంలో కోతకు సిద్ధంగా ఉన్న టమాట పొలంలో రాత్రి దొంగలు పడ్డారు. దాదాపు రూ.2.5 లక్షల విలువైన 50-60 సంచుల టమాటాను కోసుకుపోయారని బాధిత రైతు ధరణి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
టమాటాతో పాటు పచ్చి మిర్చి ధర కూడా భారీగానే పెరిగింది. పచ్చి మిర్చి కిలో రూ.120 నుంచి రూ.150 పలుకుతోంది. మిగతా కూరగాయల రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కూరగాయలే కాదు చికెన్, గుడ్ల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో దేశంల ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications