G20 Summit 2023: ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. అయితే వీటి నుంచి అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని భారత్ ఎప్పటి నుంచో వారిస్తోంది. ఈ క్రమంలో ఇండియాలో వాటిపై ఉక్కుపాదం మోపింది.
తాజాగా G20 నాయకులు క్రిప్టోకరెన్సీలపై IMF-FSB తీసుకొచ్చిన సింథసిస్ పేపర్‌ను అంగీకరించారు. ఇందులో రోడ్‌మ్యాప్, సమన్వయంతో కూడిన సమగ్రమైన విధానం, నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌కు మద్దతునిస్తుందని సెప్టెంబర్ 9న చర్చా పత్రం తెలిపింది. దీనిని సెప్టెంబర్ 9-10 తేదీలలో లీడర్స్ సమ్మిట్‌కు ముందు న్యూఢిల్లీలో జరిగిన ఫైనాన్స్ డిప్యూటీల సమావేశంలో చర్చించారు. క్రిప్టో అసెట్ ఎకోసిస్టమ్‌లో వేగవంతమైన పరిణామాల ప్రమాదాలను నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నట్లు జీ20 డిక్లరేషన్ వెల్లడించింది.

క్రిప్టో ఆస్తుల కార్యకలాపాలు, గ్లోబల్ స్టేబుల్ కాయిన్ ఏర్పాట్ల నియంత్రణ, పర్యవేక్షణ కోసం ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (FSB) ఉన్నత-స్థాయి సిఫార్సులను జీ20 సభ్యులు ఆమోదించారు. అసలు క్రిప్టో కరెన్సీలను నియంత్రిస్తారా లేక పూర్తిగా నిషేధిస్తారా అనే అంశాన్ని తాను ఈ స్థాయిలోనే చర్చించదలుచుకోవటం లేదని దిల్లీలో మీడియాకు వెల్లడించారు. దానిపై జీ20 నిర్ణయిస్తుందంటూ బదులిచ్చారు.
రెగ్యులేటరీ ఆర్బిట్రేజీని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన పద్ధతిలో ఈ సిఫార్సులను సమర్థవంతంగా, సమయానుకూలంగా అమలు చేయడాన్ని ప్రోత్సహించాలని ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్, ప్రామాణిక సెట్టింగ్ బాడీలను కోరినట్లు G20 డిక్లరేషన్ పేర్కొంది. రానున్న కాలంలో ఇది కార్యరూపం దాల్చితే క్రిప్టోల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరగవచ్చని తెలుస్తోంది. అలాగే వీటిని అక్రమ కార్యకలాపాలకు, టెర్రర్ ఫండింగ్ వంటి వాటికి వినియోగించకుండా కట్టడి చేసేందుకు వీలు కలగనుంది. పూర్తి స్థాయి నియంత్రణ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు సైతం స్థిరత్వాన్ని పొందుతాయి.


Click it and Unblock the Notifications