విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు(FPI) గత పన్నెండేళ్లుగా ఎప్పుడూ లేని విధంగా గత నవంబర్‌లో ఏకంగా 810 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులను మన మార్కెట్లోకి చొప్పించినట్లు విదేశీ బ్రోకరేజీ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ తెలిపింది. దేశీయ కరెన్సీలో ఇది రూ.60,000 కోట్లు. డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు 500 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు తెలిపింది. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 24 శాతంగా ఉంది. మన మార్కెట్ల నుండి దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు నవంబర్ నెలలో 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.

ఆ తర్వాత ఇదే రికార్డ్
గత ఆగస్ట్ నెలలో FPIలు మన మార్కెట్లలో 630 కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెట్టారు. FPIలు ఎక్కువగా ఆర్థిక రంగంలో ఇన్వెస్ట్ చేశారు. దీని పరిమాణం 400 కోట్ల డాలర్ల వరకు ఉంది. 2020లో ఇప్పటి వరకు FPIలు దాదాపు 2000 కోట్ల డాలర్లను మన మార్కెట్లోకి తీసుకు వచ్చారు. డాలర్ల ప్రాతిపదికన 2012 తర్వాత ఇదే అత్యధికం. గతంలో 2020, 2012లో మాత్రమే ఒక ఏడాదిలో 2000 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు మన మార్కెట్లోకి వచ్చాయి.

ఏ దేశం నుండి ఎంత అంటే
FPIలు దేశీయ మార్కెట్లలోకి అధిక మొత్తంలో పెట్టుబడులను గుమ్మరిస్తుండటంతో గత అక్టోబర్ నెల నుండి మార్కెట్ ఏకంగా 18 శాతం ర్యాలీ కనబరిచిందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ తెలిపింది. మొత్తం 810 కోట్ల డాలర్లలో బ్రెజిల్ నుండి 620 కోట్ల డాలర్లు, దక్షిణ కొరియా 520 కోట్ల డాలర్లు, తైవాన్ 450 కోట్ల డాలర్లు, థాయ్‌లాండ్ 110 కోట్ల డాలర్లు ఉన్నాయి.

ఆశాజనకంగా
పరిశ్రమలు, మెటిరీయల్స్ రంగాలపై బ్రోకరేజీ సంస్థ ఆశాజనకంగా ఉంది. 810 కోట్ల డాలర్లలో 8 కోట్ల డాలర్లు యాక్టివ్ ఫండ్స్ నుండి వచ్చాయి. ఫైనాన్షియల్స్‌లో 4.75 శాతం, ఐటీలో 1.48 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 20 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కరోనా నేపథ్యంలో మార్చిలో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడంతో ఆ సమయంలో కొద్ది నెలలు తగ్గినప్పటికీ, ఆ తర్వాత క్రమంగా పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications