భారతదేశంలో ఆధ్యాత్మికతకు, జ్యోతిష్యానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నమ్మకాన్ని ఒక పద్ధతి ప్రకారం బిజినెస్ మోడల్‌గా మార్చి, అద్భుతాలు చేస్తోంది ప్రముఖ ఆన్‌లైన్ జ్యోతిష్య ప్లాట్‌ఫారమ్ ఆస్ట్రోటాక్ (Astrotalk). కేవలం ఫోన్ కాల్స్, చాటింగ్ ద్వారా సలహాలు ఇవ్వడమే కాకుండా, ఇప్పుడు 'ఆస్ట్రోటాక్ స్టోర్' (Astrotalk Store) పేరుతో ఈ-కామర్స్ రంగంలోనూ దూసుకుపోతోంది.

కేవలం రూ. 30 లక్షల ప్రారంభ పెట్టుబడితో మొదలైన ఈ స్టోర్.. 2025 ఏడాదిలో ఏకంగా రూ.140 కోట్ల ఆదాయాన్ని గడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దీని వార్షిక ఆదాయం (Annual Run Rate) రూ. 200 కోట్లకు పైగా ఉండటం విశేషం.
అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది?
సాధారణంగా మనం జ్యోతిష్యులను కలిసినప్పుడు వారు కొన్ని పరిహారాలు చెబుతుంటారు. రుద్రాక్షలు ధరించమని, కొన్ని రత్నాలు (Gemstones) పెట్టుకోమని లేదా నిర్దిష్టమైన పూజా సామాగ్రి వాడమని సూచిస్తుంటారు. అయితే ఇక్కడే వినియోగదారులు ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. బయట మార్కెట్‌లో దొరికే రత్నాలు అసలైనవేనా? వాటి నాణ్యత ఎంత? అన్నది పెద్ద ప్రశ్న.
ఈ గ్యాప్‌ని గమనించిన ఆస్ట్రోటాక్ (Astrotalk) ఫౌండర్ పునీత్ గుప్తా, నమ్మకమైన, నాణ్యమైన ఆధ్యాత్మిక ఉత్పత్తులను అందించడానికి నవంబర్ 2024లో 'అస్ట్రోటాక్ స్టోర్'ను ప్రారంభించారు.
రూ. 30 లక్షల నుంచి రూ. 140 కోట్లకు ఎలా చేరింది?
మొదట చిన్న పెట్టుబడితో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ బిజినెస్‌లో, కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. దాంతో కంపెనీ మరో రూ. 40 కోట్లు అదనంగా పెట్టుబడి పెట్టింది. ఈ నిధులను ఇన్వెంటరీ పెంచడానికి, సప్లై చైన్ బలోపేతం చేయడానికి, మార్కెటింగ్ కోసం ఉపయోగించారు.
- ఆర్డర్ల వెల్లువ: 2025 ఒక్క ఏడాదిలోనే ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా 16 లక్షలకు పైగా ఆర్డర్లు డెలివరీ అయ్యాయి.
- ఉత్పత్తుల వైవిధ్యం: ప్రస్తుతం ఈ స్టోర్‌లో రుద్రాక్షలు, రత్నాలు, బ్రాస్‌లెట్లు, విగ్రహాలు, పూజా సామాగ్రి వంటి 300కు పైగా రకాలు అందుబాటులో ఉన్నాయి.
- రిపీట్ కస్టమర్లు: ఇక్కడి విశేషం ఏంటంటే ఒకసారి వస్తువులు కొన్నవారిలో 24% మంది మళ్లీ మళ్లీ కొనుగోలు చేస్తున్నారు.
టయర్ 2, టయర్ 3 నగరాల్లోనే ఎక్కువ క్రేజ్!
సాధారణంగా ఇటువంటి స్టార్టప్ లు మెట్రో నగరాలకే పరిమితం అవుతాయని అనుకుంటాం. కానీ, ఆస్ట్రోటాక్ (Astrotalk) బిజినెస్ ఆఫీసర్ దామన్ సోని చెబుతున్న దాని ప్రకారం.. భవిష్యత్తులో వచ్చే సేల్స్ లో 50% వాటా చిన్న నగరాలు, పట్టణాల నుంచే ఉండబోతోంది. మధ్యతరగతి ప్రజలు ఆధ్యాత్మిక ఉత్పత్తుల నాణ్యత విషయంలో అస్ట్రోటాక్ ను ఎక్కువగా నమ్ముతున్నారు.
ముందున్న భారీ లక్ష్యాలు (Future Plans)
2027 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ఈ-కామర్స్ విభాగం ద్వారా రూ.400 నుంచి రూ. 500 కోట్ల ఆదాయాన్ని సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఇప్పుడున్న 300 ఉత్పత్తులను 500కు పైగా పెంచాలని ప్లాన్ చేస్తోంది. కేవలం అప్పుడప్పుడు కొనే వస్తువులే కాకుండా నిత్యం పూజ గదిలో వాడే వస్తువులను కూడా ఈ స్టోర్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు.
మొత్తానికి ఆన్‌లైన్ కన్సల్టేషన్ ద్వారా రూ.1,176 కోట్ల ఆదాయాన్ని దాటేసిన ఆస్ట్రోటాక్ (Astrotalk), ఇప్పుడు తన స్టోర్ ద్వారా భారతీయ ఆధ్యాత్మిక మార్కెట్‌లో చరిత్ర సృష్టిస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications