World Cup 2023: భారత్ ప్రపంచ కప్ గెలిస్తే రూ.100 కోట్లు పంపిణీ.. సీఈవో భారీ బెట్..
Astrotalk 100 Cr: ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్ ఆడుతోంది. ఈ క్రమంలో అందరి చూపు రేపు మ్యాచ్ ఎవరు గెలుస్తారనేదానిపైనే నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో ఒక కంపెనీ భారీ ఆఫర్ ప్రకటించింది.
దేశంలో ఆస్ట్రాలజీ వ్యాపారంలో దూసుకుపోతున్న డిజిటల్ స్టార్టప్ ఆస్ట్రోటాక్ సీఈవో కీలక ప్రకటన చేశారు. ఆదివారం జరుగుతున్న ప్రపంచ కప్ ఆఖరి మ్యాచ్ భారత్ గెయిస్తే తమ కస్టమర్లకు రూ.100 కోట్లు అందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ దాదాపు 3 కోట్ల కంటే ఎక్కువ మంది రిజిస్టర్డ్ కస్టమర్లను కలిగి ఉంది. కంపెనీ సీఈవో పునీత్ గుప్తా చేసిన అతిపెద్ద ఆఫర్ ప్రస్తుతం పెద్ద సంచలనంగా మారింది.

ఇండియా ప్రపంచ కప్ గెయిస్తే కస్టమర్ల వ్యాలెట్లలో పేర్కొన్న మెుత్తాన్ని కంపెనీ సమానంగా జమచేస్తుందని సీఈవో పేర్కొన్నారు. దీంతో అనేక మంది ఇప్పుడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ODI వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో భారత్ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చివరి పోరుకు కొన్ని గంటల ముందర ఆస్ట్రోటాక్ CEO పునీత్ గుప్తా తాజా ప్రకటన చేశారు.
2011లో భారత్ ధోనీ కెప్టెన్సీలో చివరిగా ప్రపంచ కప్ గెలుచుకున్న నాటి జ్ఞాపకాలను పునీత్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తాను కాలేజీలో చదువుకుంటున్నట్లు లింక్డ్‌ఇన్ పోస్టులో పంచుకున్నారు. అది తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుల్లో ఒకటని పేర్కొన్నారు. ఆ సమయంలో రాత్రంతా మ్యాచ్ గురించి మిత్రులతో చర్చిస్తూ ఉన్నందున మ్యాచ్ జరిగే రోజు ముందు సరిగ్గా నిద్రపోలేదని చెప్పుకొచ్చారు. ఇండియా విజేతగా నిలవటంతో ఒక్కసారిగా గూస్‌బంప్స్ వచ్చాయని.. చండీగఢ్‌లో బైక్ రైడ్‌కి వెళ్లామని తెలిపారు.
గతసారి తన ఆనందాన్ని పంచుకోవటానికి కొంతమంది స్నేహితులు ఉన్నారని.. కానీ ఇప్పుడు చాలా మంది ఆస్ట్రోటాక్ వినియోగదారులు ఉన్నారని CEO పునీత్ గుప్తా అన్నారు. అందుకే ఈ సారి తన ఆనందరాన్ని యాప్ వినియోగదారులతో పంచుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఉదయం తన ఫైనాన్స్ టీమ్‌తో మాట్లాడానని.. టీమ్ ఇండియా గెలిస్తే రూ.100 కోట్లు పంపిణీ చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.


Click it and Unblock the Notifications