Multibagger Stock: గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి చాలా మంది ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసింది. ప్రతి ఒక్కరూ పోర్ట్‌ఫోలియో నష్టాల్లోకి జారుకోవటంపై చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా.. స్వల్పకాలంలో మల్టీబ్యాగర్ రాబడులు ఆశించిన ఇన్వెస్టర్లు మరింత నిరాశకు గురయ్యారు. అయినప్పటికీ.. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో చాలా స్టాక్స్ ఉన్నాయి.
అవి ఇటీవలి మార్కెట్ కరెక్షన్ తరువాత కూడా మల్టీబ్యాగర్లుగా నిరూపించుకున్నాయి. తమ ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ అందించాయి. అలా పెట్టుబడిదారులకు మంచి రాబడులను అందించిన వాటిలో ప్లాస్టిక్ పైపుల వ్యాపారం నిర్వహిస్తున్న ఆస్ట్రల్ లిమిటెడ్(Astral Limited) కూడా ప్రస్తుతం నిలిచింది.

దీర్ఘకాలంలో ధనవంతులైన ఇన్వెస్టర్లు..
ఈ రోజు మధ్యాహ్నం ట్రేడింగ్‌లో బిఎస్‌ఈలో ఆస్ట్రల్ లిమిటెడ్ షేరు 1.34 శాతం లాభపడి రూ. 1,656 పైన ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్కెట్ల కరెక్షన్, ఒడిదొడుకుల కారణంగా అమ్మకాలకు గురైన ఈ స్టాక్ దాదాపు 30 శాతం ధరను కోల్పోయింది.
ఒకప్పుడు దీని ధర రూ.2,500 మార్క్ ను కూడా దాటింది. ప్రస్తుతం ఈ స్టాక్ తన 52 వారాల కనిష్ఠ స్థాయి అయిన రూ. 1,601.55కి చాలా దగ్గరగా ట్రేడ్ అవుతోంది. స్టాక్ గత చరిత్రను గమనిస్తే.. దీర్ఘకాలం కోసం ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి షేర్ 10 సంవత్సరాల్లో రాకెట్ లాగా పెరిగి ఊహించని ఆదాయాన్ని అందించింది.

10 ఏళ్లలో 6000% కంటే ఎక్కువగా పెరిగిన ధర..
10 సంవత్సరాల క్రితంతో ఆస్ట్రల్ లిమిటెడ్ షేరు ధరను గమనిస్తే.. అప్పట్లో అది కేవలం రూ. 25.75గా ఉంది. ప్రస్తుతం షేర్ విలువ మార్కెట్లో దాదాపు రూ.1,656 మార్కును కూడా దాటింది. అంటే.. గడచిన 10 సంవత్సరాల కాలంలో ఈ స్టాక్ తన ఇన్వెస్టర్లకు 6,000 శాతానికి పైగా రాబడిని అందించింది. ఒక వ్యక్తి ఈ స్టాక్ లో 10 సంవత్సరాల కిందట రూ. లక్ష పెట్టుబడి పెట్టి ఉన్నట్లయితే.. ప్రస్తుతం దాని విలువ దాదాపు రూ.63 లక్షలు దాటి ఉండేది.

ఐదేళ్లలో ఇన్వెస్టర్లకు ఎంత రాబడిని అందించిందంటే..
గత ఏడాది నుంచి ఈ స్టాక్ కరెక్షన్ కారణంగా దాని ధర క్షీణతకు గురవుతోంది. గత నెలలో రూ.1,712తో పోలిస్తే ప్రస్తుతం దాని విలువ 5 శాతానికి పైగా పడిపోయింది. గత 6 నెలల్లో షేర్ ధర దాదాపు 28 శాతం క్షీణించగా.. గత ఏడాది కాలంలో దాదాపు 16 శాతం తగ్గింది. అయితే.. మీరు లాంగ్ టర్మ్ గణాంకాలను గమనిస్తే.. ఖచ్చితంగా మీ అభిప్రాయం మారుతుంది.
10 ఏళ్ల విషయాన్ని పక్కనపెడితే.. గడచిన 5 సంవత్సరాల కాలాన్ని మాత్రమే పరిగణనించినా.. ఈ స్టాక్ సుమారు 290 శాతం రాబడిని ఇచ్చింది. ఇది యావరేజ్ లెక్కన చూస్తే దాదాపు 32 శాతం వడ్డీకి సమానమైన రాబడిని తన ఇన్వెస్టర్లకు అందించింది.


Click it and Unblock the Notifications