Aster DM Healthcare: ప్రస్తుతం దేశంలోని కార్పొరేట్ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియటంతో త్రైమాసిక ఫలితాలతో తమ పెట్టుబడిదారులకు డివిడెండ్ ప్రకటిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బంపర్ డివిడెండ్ ప్రకటించిన ఆస్టర్ డీఎమ్ హెల్త్ కేర్ లిమిటెడ్ కంపెనీ గురించే. ప్రస్తుతం ఇన్వెస్టర్లు మార్కెట్లో అధిక డివిడెండ్ అందిస్తున్న షేర్లపై బెట్టింగ్ వేస్తున్నారు. ఈ క్రమంలో Aster DM హెల్త్‌కేర్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో ఎక్స్-డివిడెండ్ స్టాక్‌గా ట్రేడవుతున్నాయి. ఒక్కో షేరుపై కంపెనీ పెట్టుబడిదారులకు రూ.118 డివిడెండ్ అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో దాదాపు రూ.520 ధర వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

కంపెనీ తన ఇన్వెస్టర్లకు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.118 డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ లిమిటెడ్ యాజమాన్యం పేర్కొంది. డివిడెండ్ చెల్లింపుకోసం రికార్డు తేదీని ఏప్రిల్ 23గా కంపెనీ నిర్ణయించింది. దీని ప్రకారం కంపెనీ రికార్డు తేదీ పుస్తకంలో పేరు ఉన్న పెట్టుబడిదారులు డివిడెండ్ ప్రయోజనం పొందుతారు. ప్రకటించిన 30 రోజుల్లోగా ప్రత్యేక డివిడెండ్‌ను అందజేస్తామని స్టాక్‌మార్కెట్లకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది.
శుక్రవారం కంపెనీ షేర్ల ధర 0.24 శాతం పతనం తర్వాత రూ.520.80 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో కంపెనీ షేర్ల ధరలు 18 శాతం పెరిగాయి. అదే సమయంలో 6 నెలల పాటు స్టాక్‌ను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు ఇప్పటివరకు 58.2 శాతం లాభపడ్డారు. గత ఏడాది కాలంలో ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ లిమిటెడ్ షేరు ధర 104 శాతం పెరిగింది. బీఎస్ఈలో కంపెనీ 52 వారాల గరిష్ట ధర రూ.558.30గా ఉండగా.. స్టాక్ 52 వారాల కనిష్ట ధర రూ.238.90 వద్ద ఉంది. ఇదే సమయంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.26,014.64 కోట్లుగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications