Byjus News: బైజూస్‌కి బ్లాక్‌రాక్ గట్టి షాక్.. అత్యంత విలువైన స్టార్టప్ నుంచి మరీ దారుణంగా..
BlackRock: భారతదేశపు అత్యంత విలువైన స్టార్టప్‌గా 22 బిలియన్ డాలర్ల వాల్యూతో బైజూస్ రికార్డు సృష్టించింది. అప్పట్లో ఓ వెలుగొందిన ఈ స్టార్టప్ దిగ్గజం.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తిరిగి పుంజుకుందామని భావిస్తున్న ప్రతిసారీ ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ బ్లాక్ రాక్ తాజాగా గట్టి షాక్ ఇచ్చింది.
అసెట్ మేనేజర్ బ్లాక్ రాక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బైజూస్‌లో తన హోల్డింగ్ విలువను మరోసారి కట్ చేసింది. భారతీయ స్టార్టప్ అంచనా విలువను 2022 ప్రారంభంలో 22 బిలియన్ డాలర్ల నుంచి దారుణంగా 1 బిలియన్లకు తగ్గించింది. గతేడాది అక్టోబరులో ఒక్కో షేర్ విలువను 4 వేల 660 డాలర్ల నుంచి 209.6 డాలర్లుగా సవరించింది.

బ్లాక్ రాక్ కు బైజూస్‌లో 1 శాతం కంటే తక్కువ వాటానే ఉంది. అయితే తన హోల్డింగ్ విలువను తగ్గించడం ఇదే మొదటిసారి కాదు. కానీ ఈసారి సర్దుబాటు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. 9 శాతం వాటా కలిగి ఉన్న ప్రోసస్ కూడా గతేడాది చివర్లో బైజూస్ విలువను 3 బిలియన్లుగా పేర్కొనగా.. బ్లాక్ రాక్ మాత్రం మరింత తగ్గించింది.
2021, 2022లో 2.5 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసిన బైజూస్.. ప్రపంచవ్యాప్తంగా అర డజనుకు పైగా సంస్థలను కొనుగోలు చేసింది, ఒకప్పుడు మార్క్యూ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల నుంచి 50 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వాల్యుయేషన్ పొందినట్లు నివేదికలు చెబుతున్నాయి. పీక్ XV పార్ట్‌నర్స్ నుంచి లైట్‌స్పీడ్, UBS మరియు చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ వరకు మార్కెట్‌లోని డజనుకు పైగా ఇన్వెస్టర్స్ బైజూస్‌కు మద్దతు ఇచ్చారు.


Click it and Unblock the Notifications