Statue of Modi: వరుసగా రెండు సార్లు ప్రధాని పదవిలో కొనసాగిన నరేంద్ర మోదీపై దేశవ్యాప్తంగా అభిమానం పెరుగుతోంది. ఇటీవల యూపీలోని అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఆయన చరిష్మా మరింతగా పెరిగింది.
ఈ క్రమంలో అసోంలోని గౌహతికి చెందిన ఒక వ్యాపారవేత్త మోదీపై తన ప్రేమను చాటుకునేందుకు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. నబిన్ చంద్ర బోరా అనే వ్యాపారి గౌహతిలోని జలుక్‌బరిలోని ప్రధాన బస్టాండ్ సమీపంలోని బోరా సొంత స్థలంలో ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం మూడు రోజుల పాటు జరిగే భూమి పూజ సోమవారం నుంచి ప్రారంభమైంది.

అయితే విగ్రహ ఏర్పాటుకు అవుతున్న మెుత్తం రూ.200 కోట్ల ఖర్చును తానే సొంతంగా భరిస్తున్నట్లు బోరా వెల్లడించారు. మెుత్తం 250 అడుగుల ఎత్తు భారీ విగ్రహంలో 60 అడుగుల పునాదిపై విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాడు. 190 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం మెడలో అస్సామీ సంస్కృతికి చిహ్నంగా ఉండే గమోసా ఉండే కాంస్య విగ్రహ డిజైన్ ఇప్పటికే ఖరారైంది. తాను తలపెట్టిన ఈ మెగా నిర్మాణ ప్రణాళికను సదరు వ్యాపారి ఇప్పటికే ప్రధాని కార్యాలయానికి పంపినట్లు వెల్లడైంది.
ప్రధాని స్థాయి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం తనకు లభించటం తనకు లభించటంపై బోరా సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానికి వీరాభిమాని అయిన నవీన్‌చంద్ర బోరా.. మోదీ చేతుల మీదుగా 2016లో ప్రశంసా పత్రాన్ని కూడా అందుకోవడం జరిగింది. అయితే విగ్రహ ఏర్పాటు పనులు పూర్తయ్యాక ప్రారంభోత్సవ కార్యక్రమానికి నరేంద్ర మోదీ హాజరవుతారని ఆశిస్తున్నట్లు బోరా పేర్కొన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications