దేశీయ పెయింట్స్ సంస్థ ఏషియన్ పెయింట్స్ జూన్ నెలతో ముగిసిన మొదటి త్రైమాసికంలో అదరగొట్టింది. మంగళవారం విడుదల చేసిన తొలి త్రైమాసిక ఫలితాల్లో ఏషియన్ పెయింట్స్ లాభాల బాటలో పయనించింది. మొదటి త్రైమాసికంలో కంపెనీ లాభాలు 161 శాతం పెరిగి 570 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇక ఆదాయం కూడా 91 శాతం పెరగడం కంపెనీ వర్గాలలో జోష్ ను పెంచింది. ఏప్రిల్-జూన్ కాలంలో ఏషియన్ పెయింట్స్ 570 కోట్ల రూపాయల ఏకీకృత లాభాన్ని సంపాదించింది.
అంతకుముందు త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 218 కోట్లు . మొత్తంగా మొదటి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 5,580 కోట్లుగా క్యూ 3 ఫలితాలను బట్టి తెలుస్తోంది. స్టాక్ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం ఏషియన్ పెయింట్స్ ఈబిఐటిడిఎ 484 కోట్ల రూపాయల నుండి 1200 కోట్లకు పెరగడం కంపెనీ సాధించిన విజయానికి నిదర్శనం. ఈబిఐటిడిఎ మార్జిన్ కూడా 16.5 శాతం గత సంవత్సరం నుండి 21.7 శాతానికి పెరిగింది. గత ఏడాది మొదటి త్రైమాసికంలో 2870.6 కోట్లు కంపెనీ ఆదాయంగా ఉండగా, ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి 5,580 కోట్లకు చేరుకుంది. పెయింట్ వ్యాపారం ఏబీఐటీ కూడా రూ.371.6 కోట్ల నుంచి రూ.809.1 కోట్లకు పెరిగింది. ఏబీఐటీ మార్జిన్లు కూడా గత ఏడాది 12.9 శాతం నుండి 14.8 శాతానికి పెరిగాయి.

క్యూ 1 ఎఫ్‌వై 20 తో పోల్చితే ఈ వ్యాపారం విలువ మరియు వాల్యూమ్‌లో బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఇది సాధారణ త్రైమాసికం, ఇది బలమైన స్థిరమైన పథానికి సూచిక అని ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సిఈఒ అమిత్ సింగిల్ అన్నారు. పారిశ్రామిక వ్యాపారం మరియు గృహ-అభివృద్ధి వ్యాపారం కూడా గత సంవత్సరం కంటే వారి ఆదాయాన్ని రెట్టింపు చేసింది. గత ఏడాది మొదటి త్రైమాసికంలో కొంత వ్యాపారం కొనసాగించిన అంతర్జాతీయ వ్యాపారం, బలమైన రెండంకెల ఆదాయ వృద్ధిని నమోదు చేసింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications