Asian Paints: దేశంలో మోదీ సర్కార్ వచ్చిన నాటి నుంచి దేశం అభివృద్ధిల్లో అంకెల గారడీ జరుగుతోందా అనే అనుమానాలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. వాస్తవ వృద్దికి ప్రభుత్వ గణాంకాలకు పొందనలేదంటూ పరిశ్రమ వర్గాల నుంచి టాక్ ఎన్నికల వేళ హీటెక్కిస్తోంది. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితులపై కామెంట్స్ కల్లోలం సృష్టిస్తూ బీజేపీ ప్రభుత్వంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఇది కాంగ్రెస్ చేతిలో అస్త్రంగా మారింది.
వివరాల్లోకి వెళితే తాజాగా.. ఏషియన్ పెయింట్స్ MD, CEO అమిత్ సింగల్ భారత జీడీపీ గణాంకాలపై విరక్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం చూపుతున్న గణాంకాలు స్టీల్, సిమెంట్ సహా ప్రధాన రంగాలకు సంబంధం లేకుండా ఉన్నాయన్నారు. దేశ వృద్ధి రేటు కోర్ సెక్టార్‌లతో పరస్పర సంబంధం ఉన్నట్లు కనిపించడం లేదని సింగల్ మే 9న ఇన్వెస్టర్ల ప్రశ్నలకు బదులిస్తూ వెల్లడించారు. ప్రస్తుత సంవత్సరంలో జీడీపీ అంకెలు నిజంగా వాస్తవానికి సరిపోలటం లేదని సింగల్ ఒక పెట్టుబడిదారుని ప్రశ్నకు బదులిచ్చారు. అయితే ప్రస్తుతం జీడీపీ అంకెలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయో తనకు ఖచ్చితంగా తెలియదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కొన్నిసార్లు పరిశ్రమల అంతటా ఇటువంటి వైవిధ్యం జరుగుతోందని సింగల్ జీడీపీ సంఖ్యలపై కామెంట్ చేశారు. మనం మాట్లాడుకుంటున్న జీడీపీకి వాస్తవ జీడీపీకి సంబంధం కనిపించటం లేదన్నారు. ఏషియన్ పెయింట్స్ టాప్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ రంగాలకు "వాస్తవికంగా " జీడీపీ వృద్ధిని "సాధారణీకరించడం" అవసరం. 7 శాతం జీడీపీని నామినలైజేషన్ నుంచి చూస్తే అది కొన్ని సెక్టార్లలో 4-5 శాతంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఏషియన్ పెయింట్స్ కంపెనీ అసలు జీడీపీ ఏమిటో కనుగొనే పనిలో ఉందని సింగల్ వెల్లడించారు. వాస్తవ జీడీపీ ఏమిటో కనుగొనడంలో మార్గాలను చూస్తున్నట్లు చెప్పారు.
దేశంలో దిగ్గజ కంపెనీ సీఈవో కామెంట్స్ పెద్ద ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. ఈ విషయం కాంగ్రెస్ చేతికి ఎన్నికల అస్త్రంగా మార్చుకుంటోంది. జీడీపీ అంకెలపై కాంగ్రెస్ సైతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎటాక్ చేస్తోంది. సింగల్ కామెంట్స్ తర్వాత ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న భారత జీడీపీ అంకెలు నకిలీ డేటాతో నిండినట్లు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. దేశంలో అందరూ చెబుతున్న విషయం ఏషియన్ పెయింట్స్ MD & CEO అమిత్ సింగల్ ద్వారా ధృవీకరించబడిందని కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. GDP సంఖ్యలు, అంతర్లీన రంగాల మధ్య ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. 2024 ఎన్నికలు చివరి దశకు చేరుకున్న వేళ అధికార బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి కొత్త సమస్య ఎదురైంది.


Click it and Unblock the Notifications