Paisa Double Stock: నెలలో లక్షను రెండు లక్షలు చేసిన స్టాక్.. రాకింగ్ స్టాక్ పూర్తి వివరాలు..
Multibagger Stock: మార్కెట్లో చాలా కాలం తర్వాత మళ్లీ మల్టీబ్యాగర్ స్టాక్స్ తమ ప్రతాపం చూపించటం మెుదలెట్టాయి. తమను నమ్ముకున్న ఇన్వెస్టర్లకు కాసుల పంట కురిపించటం ప్రారంభించాయి. ఈ క్రమంలో తాజాగా ఒక స్టాక్ ఏకంగా నెలరోజుల్లోనే పెట్టుబడిదారుల డబ్బును రెండితలు చేసేసింది. స్వల్పకాలంలోనే పైసా డబుల్ చేసేసింది స్టాక్.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. ఈ స్టాక్ కేవలం ఒక్క నెల కాలంలో ఇన్వెస్టర్ల డబ్బును రెండింతలు చేసింది. ప్రస్తుతం ఈ స్టాక్ మార్కెట్లో దాదాపు రూ.110 ధర వద్ద ట్రేడవుతోంది. గడచిన ఆరు సెషన్లలో స్టాక్ బీఎస్ఈలో 37 శాతానికి పైగా లాభపడింది. కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలను పెంచుకోవటం కూడా దీనికి దోహదపడింది.

2023 ఆర్థిక సంవత్సరం మెుదటి అర్థ భాగంలో కంపెనీ బలహీనమైన ఆదాయాలను కలిగి ఉన్నప్పటికీ లాభాలను ఆర్జించగలిగింది. కంపెనీ ఇటీవల పుదుచ్చేరిలోని ఆఫ్ షోర్ ప్రాంతంలో గ్యాస్, చమురు ఉత్పత్తికి రూ.165 కోట్ల విలువైన డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న స్వెతా ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ FZE ద్వారా లెటర్ ఆఫ్ అవార్డ్ ను కూడా పొందింది.
గుజరాత్ ప్రభుత్వం నుంచి ముడి చమురు, సహజవాయువును వెలికితీసేందుకు DSF బ్లాక్ కోసం ఏప్రిల్ 1, 2023 నుంచి 20 ఏళ్ల పాటు మైనింగ్ లీజును తన హోల్డింగ్ కంపెనీ ఆయిల్‌మాక్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు మంజూరు చేసినట్లు ఆసియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌తో ఒక ఫైలింగ్‌లో ప్రకటించింది. ఈ వార్తల నేపథ్యంలో కంపెనీపై ఇన్వెస్టర్ల దృష్టి పడింది.

ఫిబ్రవరి 28, 2023న ఏషియన్ ఎనర్జీ స్టాక్ ధర రూ.54.75గా ఉంది. అయితే తాజాగా మార్చి 24 ఉదయం షేర్ ధర రూ.110కి ఎగబాకింది. అయితే కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో స్టాక్ ఆరంభంలోని లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. 11.42 గంటల సమయంలో స్టాక్ ధర బీఎస్ఈ సూచీలో రూ.101.21 వద్ద స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications