దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. రష్యా... ఉక్రెయిన్ ఆక్రమణ ఎక్కువవుతోంది. ఆ దేశంలోని కీలక పట్టణాలు మాస్కో చేతుల్లోకి వెళ్తున్నాయి. ఉక్రెయిన్‌కు చెందిన ఐరోపాలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేసింది. చెర్నోబిల్‌తో పోలిస్తే ఇది పది రెట్లు పెద్దది. రష్యా దాడి ఉక్రెయిన్‌తో పాటు ఐరోపాను ఆందోళనకు గురి చేస్తోంది. అమెరికా, యూరోపియన్ దేశాల కఠిన ఆంక్షలను రష్యా లెక్కలోకి తీసుకోవడం లేదు. ఆంక్షల కారణంగా పుతిన్ దూకుడుకు అడ్డుకట్ట పడుతుందని అంతర్జాతీయ సమాజం భావించింది. కానీ పుతిన్ మరింత ఊపుతో ముందుకు సాగుతున్నారు. ఇది ప్రపంచానికి వణికిస్తోంది. దీంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు పెరుగుతుండగా, స్టాక్ మార్కెట్ కుప్పకూలుతోంది.

1000 పాయింట్లు పతనం
సెన్సెక్స్ నేడు ఉదయం గం.10.30 సమయానికి 1042 పాయింట్లు లేదా 1.91 శాతం క్షీణించి 54,050 పాయింట్ల వద్ద, నిఫ్టడీ 311 పాయింట్లు లేదా 1.9 శాతం క్షీణించి 16,187 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ ఉదయం 54,653 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,653 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,057 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,339 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,364 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,180 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

అన్ని రంగాలు నష్టాల్లోనే...
అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా, రియాల్టీ రంగాలు ఒక శాతం చొప్పున పడిపోయాయి. ఉదయం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో యూపీఎల్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా స్టీల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, మారుతీ సుజుకీ, హీరో మోటో కార్ప్, ఐచర్ మోటార్స్, HUL ఉన్నాయి.

కుప్పకూలిన ఆసియా మార్కెట్
రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు 16 నెలల కనిష్టానికి పడిపోయాయి. జకర్తా కాంపోజిట్ తప్ప మిగతా అన్ని దేశాల స్టాక్స్ నష్టాల్లోనే ఉన్నాయి. ఆసియా మార్కెట్ విషయానికి వస్తే నిఫ్టీ దాదాపు 2 శాతం, జపాన్ నిక్కీ 2.3 శాతం, స్ట్రెయిట్ టైమ్స్ 0.51 శాతం, హాంగ్ షెంగ్ 2.67 శాతం, టైవాన్ వెయిటెడ్ 0.93 శాతం, కోస్పి 1.26 శాతం, సెట్ కాంపోజిట్ 0.46 శషాతం, షాంఘై కాంపోజిట్ 0.66 శాతం నష్టపోయాయి. కేవలం జకర్తా కాంపోజిట్ మాత్రమే 0.54 శాతం లాభపడింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications