ఆసియా మార్కెట్లో బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మార్కెట్లో తీవ్ర అస్థిరత నెలకొంది. పసిడి ధరలు ఎప్పుడు ఎలా మారుతున్నాయో అర్థం కావడం లేదు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుడంటతో అందరూ పసిడి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ధరలు ఎలా ఉంటాయోననే అయోమయానికి గురవుతున్నారు. దేశంలో బంగారం ప్రీమియంలు ఈ వారం దశాబ్ద కాలంలో గరిష్ట స్థాయిల నుంచి సగానికి పైగా తగ్గిపోయాయి.
గత వారం నమోదైన రికార్డు ప్రీమియంలతో పోలిస్తే ఈ Gold తగ్గుదల గణనీయమైనదిగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇదే సమయంలో చైనాలో మాత్రం చంద్ర నూతన సంవత్సరానికి ముందు బంగారం డిమాండ్ స్పష్టంగా పెరిగింది.
ఈ వారం భారతదేశంలో బులియన్ డీలర్లు అధికారిక దేశీయ బంగారం ధరలపై ఔన్సుకు గరిష్టంగా 70 డాలర్ల వరకు ప్రీమియం వసూలు చేశారు. ఇందులో 6 శాతం దిగుమతి సుంకం, 3 శాతం అమ్మకపు పన్ను కూడా కలిసివుంది. ఇది గత వారం నమోదైన ఔన్సుకు 153 డాలర్ల ప్రీమియంతో పోలిస్తే భారీ తగ్గుదలగా భావిస్తున్నారు. గత వారం ప్రీమియం స్థాయి డిసెంబర్ 2013 తర్వాత అత్యధికంగా నమోదైంది.

ముంబైకి చెందిన ఒక ఆభరణాల వ్యాపారి మాట్లాడుతూ.. ఈ వారం ధరలు ఎడాపెడా మారడంతో కొనుగోలుదారులు గందరగోళానికి గురయ్యారు. ధరలు ఎటు వెళ్తాయో అర్థం కాక, పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడానికి వెనుకాడుతున్నారని తెలిపారు. ధరలలో స్పష్టమైన దిశ లేకపోవడం వల్ల రిటైల్ డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడిందని ఆయన అన్నారు.
గత వారం బంగారం ప్రీమియంలు పెరగడానికి బడ్జెట్‌లో దిగుమతి సుంకం పెంపు ఉండొచ్చన్న అంచనాలే కారణమని ముంబైకి చెందిన ఒక బులియన్ దిగుమతి బ్యాంకు డీలర్ వివరించారు. అయితే, డిమాండ్ బలహీనపడడంతో ఈ వారం ప్రీమియంలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి సమర్పించిన 2026-27 కేంద్ర బడ్జెట్‌లో బంగారం దిగుమతి సుంకాల నిర్మాణంలో ఎటువంటి మార్పులు చేయలేదు. దీంతో మార్కెట్‌లో ఆందోళనలు తగ్గాయి.
దేశీయ మార్కెట్‌లో శుక్రవారం నాడు బంగారం ధరలు 10 గ్రాములకు దాదాపు రూ.1,50,000 వద్ద ట్రేడయ్యాయి. గత వారం నమోదైన రికార్డు స్థాయి రూ.1,80,779 నుంచి ఈ వారం ధరలు రూ.1,33,687 కనిష్ట స్థాయికి పడిపోయాయి. అంటే ఒక్క వారంలోనే భారీ ఊగిసలాట చోటు చేసుకుంది.చైనాలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ బులియన్ ధరలు ఈ వారం గ్లోబల్ స్పాట్ ధర కంటే ఔన్సుకు 35 డాలర్ల ప్రీమియంతో ట్రేడవుతున్నాయి, ఇది గత వారం ఉన్న 32 డాలర్ల ప్రీమియంతో పోలిస్తే పెరుగుదల. చంద్ర నూతన సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో.. బంగారం కొనుగోళ్లపై ఆసక్తి పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
వింగ్ ఫంగ్ ప్రెషియస్ మెటల్స్ డీలింగ్ హెడ్ పీటర్ ఫంగ్ మాట్లాడుతూ.. భౌతిక పెట్టుబడి డిమాండ్ బాగానే కొనసాగుతోంది. ధరలు ఎక్కువైనా, వినియోగదారులు నగల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.జనవరి 29న స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు 5,594.82 డాలర్ల రికార్డు స్థాయిని తాకిన తర్వాత.. ఇప్పటివరకు 13.5 శాతం కంటే ఎక్కువగా తగ్గాయి. ఈ దిద్దుబాటు సమయోచితంగా వచ్చిందని ANZ విశ్లేషకురాలు సోని కుమారి పేర్కొన్నారు. చైనా నూతన సంవత్సరానికి ముందు బంగారం, వెండి ధరల్లో వచ్చిన సవరణ కొనుగోళ్లకు అనుకూలంగా మారిందని ఆమె వ్యాఖ్యానించారు.
చైనా గోల్డ్ అసోసియేషన్ ప్రకారం..2025లో చైనా బంగారం వినియోగం వరుసగా రెండో సంవత్సరం తగ్గింది. అయితే సురక్షిత పెట్టుబడిగా బంగారంపై ఆసక్తి పెరగడంతో, బార్లు, నాణేల అమ్మకాలు తొలిసారిగా ఆభరణాల కొనుగోళ్లను మించాయి.
ఇతర ఆసియా మార్కెట్లలో చూస్తే.. హాంకాంగ్‌లో బంగారం ధరలు దాదాపు సమానంగా ఉండగా, జపాన్‌లో బులియన్ ఔన్సుకు 7 డాలర్ల నుంచి 1 డాలర్ వరకు ప్రీమియంతో లేదా డిస్కౌంట్‌తో అమ్ముడైంది. సింగపూర్‌లో బంగారం 0.50 డాలర్ల డిస్కౌంట్ నుంచి 3 డాలర్ల ప్రీమియం వరకు ట్రేడైంది. ఏదేమైనా భారతదేశంలో ధరల అస్థిరత బంగారం డిమాండ్‌ను తగ్గిస్తుండగా, చైనాలో మాత్రం పండుగ సీజన్ ప్రభావంతో మార్కెట్‌కు మద్దతు లభిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications