Ashwini Vaishnaw: ఐటీ హార్డ్‌వేర్‌లో 50,000 ఉద్యోగాలు.. ముందంజలో Dell, HP, Lenovo..
Ashwini Vaishnaw: ఐటి హార్డ్‌వేర్ రంగంలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలకు భారత ప్రభుత్వం అనుమతివ్వటం మంచి స్పందనను పొందుతోంది. 27 కంపెనీలు ఇప్పటికే క్లియరెన్స్ అందుకున్నట్లు ఎలక్ట్రానిక్స్ & సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఆమోదించబడిన వాటిలో 23 కంపెనీలు తక్షణమే తయారీ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరో నాలుగు కంపెనీలు రానున్న 90 రోజుల్లో కార్యకలాపాలను ప్రారంభించనున్నాయని పేర్కొన్నారు. తాజా స్కీమ్ ద్వారా పరిశ్రమలోకి రూ.3,000 కోట్లను చొప్పించగలదని అంచనా వేయబడింది. దీని కారణంగా ప్రత్యక్షంగా 50,000 మందికి ప్రత్యక్ష ఉపాధి పరోక్షంగా 1,50,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందని వెల్లడైంది.

హార్డ్‌వేర్ తయారీ రంగంలో డెల్, హెచ్‌పీ, ఫాక్స్‌కాన్, లెనోవాతో సహా 40 కంపెనీలు ఐటి హార్డ్‌వేర్ పీఎల్‌ఐ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. స్కీమ్ అమలు సమయంలో కంపెనీలు రూ.4.65 లక్షల కోట్ల విలువైన పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, సర్వర్లు, కేటగిరీలోని పరికరాలను తయారు చేయడం సదరు కంపెనీల బాధ్యత. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన సంస్థల జాబితాలో డెల్, ఫాక్స్‌కాన్, హెచ్‌పీ, లెనోవో ఫ్లెక్స్‌ట్రానిక్స్, వివిడిఎల్, నియోలింక్, భగవతి, నెట్‌వెబ్, సహస్ర, ఐఎల్‌పి, ఆప్టిమస్ వంటి సుపరిచితమైన కంపెనీలున్నాయి.
దేశీయంగా తయారైన వస్తువులకు నికర అమ్మకాలలో 2 శాతం వరకు ప్రోత్సాహకాలను అందించిన మునుపటి పథకానికి భిన్నంగా, సవరించిన సంస్కరణ ప్రాథమిక ప్రోత్సాహకాన్ని గణనీయంగా 5 శాతానికి పెంచింది. మెమరీ చిప్స్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీలు, సాలిడ్-స్టేట్ డ్రైవ్‌లు, ఛాసిస్, పవర్ సప్లై కాంపోనెంట్‌లు మరియు అడాప్టర్‌లు వంటి దేశీయంగా ఉత్పత్తి చేయబడిన భాగాలను సేకరించే కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టడం ద్వారా ఇది 3 శాతానికి చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications