Defence Stock: గతకొంత కాలంగా ఇండియాలో డిఫెన్స్ కంపెనీలపై ఇన్వెస్టర్ల దృష్టి పెరిగింది. తాజాగా ఇస్రో చంద్రయాన్ ప్రయోగంతో అసలు ఈ రంగంలో పనిచేస్తున్న కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది.
దీంతో కొంత కాలంగా రక్షణ రంగ కంపెనీలు, వాటికి సంబంధించిన వ్యాపారం చేస్తున్న కంపెనీల షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఓ వార్త వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం అశోక్ లేలాండ్‌కు రక్షణ మంత్రిత్వ శాఖ రూ.800 కోట్ల విలువైన పనులను అప్పగించింది. ఈ వార్త నేపథ్యంలో నేడు అశోక్ లేలాండ్ స్టాక్ 1 శాతానికిపైగా లాభపడింది. మార్కెట్లు ముగిసే సమయంలో స్టాక్ ధర రూ.172.70 వద్ద స్థిరపడింది.

అశోక్ లేలాండ్ వెల్లడించిన సమాచారం ప్రకారం భారత ప్రభుత్వం నుంచి రూ.800 కోట్లు విలువైన డిఫెన్స్ ఆర్డర్‌ను పొందినట్లు తెలిపింది. ఫీల్డ్ ఆర్టిలరీ ట్రాక్టర్ (FAT 4x4), GTV 6x6 సరఫరా చేయడానికి తాము ఆర్డర్‌ను పొందినట్లు కంపెనీ పేర్కొంది. ఇండియన్ ఆర్మీ నుంచి ఆర్డర్ లభించినందుకు తమకు చాలా గర్వంగా ఉందని కంపెనీ సీఈవో, ఎండీ షేను అగర్వాల్ తెలిపారు. అశోక్ లేలాండ్ ఈ ఆర్డర్‌ను 12 నెలల్లో పూర్తి చేయాల్సి ఉందని తెలుస్తోంది.
గత ఏడాది కాలంలో అశోక్ లేలాండ్ షేర్ ధరలు 19 శాతానికి పైగా ర్యాలీని చూశాయి. ఏడాది క్రితం ఈ స్టాక్‌ను కొనుగోలు చేసి ఇప్పటివరకు హోల్డ్ చేసిన ఇన్వెస్టర్లు.. దాదాపు 18 శాతానికి పైగా లాభపడ్డారు. అశోక్ లేలాండ్‌లో పొజిషనల్ ఇన్వెస్టర్లకు కూడా గత నెల రోజులు బాగానే ఉన్నాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. కంపెనీ ఆర్డర్‌ను స్వీకరించిన తర్వాత సోమవారం షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.174.60ని తాకింది.


Click it and Unblock the Notifications