Ashneer Grover: ఎవ్వరూ ఊహించని వ్యాపార ఆలోచనలతో ముందుకు రావటం అంత ఈజీ కాదు. అయితే ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీల ఊహలకు అందని స్థాయిలో భారత్ పే వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ తాజాగా కొత్త వ్యాపార ఆలోచనతో ముందుకొచ్చారు.
ఆధునిక సాంకేతిక యుగంలో ప్రజలు ఎక్కువగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సేవలను పొందేందుకు మెుగ్గుచూపుతున్న వేళ సరికొత్త యాప్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వైద్య సేవలకు రుణాలను అందించే యాప్ Zeropeను గ్రోవర్ త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీంతో అష్నీర్ గ్రోవర్ ఫిన్‌టెక్ పరిశ్రమలో మరో విప్లవానికి సిద్ధమవుతున్నారు.

త్వరలో రిటైల్ వినియోగదారల కోసం దేశంలో అందుబాటులోకి రాబోతున్న యాప్.. ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉందని ద థర్డ్ యునికార్న్ అనే సంస్థ అభివృద్ధి చేస్తోందని గూగుల్ ప్లే స్టోర్ సమాచారం ప్రకారం వెల్లడైంది. భారత్ పేకి వీడ్కోలు పలికిన తర్వాత గ్రోవర్ తన భార్యతో కలిసి ది థర్డ్ యునికార్న్‌ను ప్రారంభించారు. ఆయన 2023లో క్రిక్‌బే అనే ఫాంటసీ స్పోర్ట్స్ సైట్‌ను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం గ్రోవర్ దృష్టి పూర్తిగా జీరోపేపై కేంద్రీకరించారు. వైద్య అవసరాల కోసం రూ.5 లక్షల వరకు ప్రీ-అప్రూవ్డ్ మెడికల్ లోన్‌లు యాప్ ద్వారా అందించేందుకు రూపొందించబడింది.
ZeroPay యాప్ దిల్లీకి చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ ముకు ఫిన్‌వెస్ట్‌తో కలిసి పని చేయనుంది. అయితే రుణ మెుత్తాన్ని యాప్ భాగస్వామ్యం కలిగిన నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు మాత్రమే వినియోగదారులను అనుమతించనుంది.
ప్రస్తుతం దేశంలో వైద్య సంబంధిత పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలో రోగులకు ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలు, వారికి అవసరమైన ఇన్సూరెన్స్ పాలసీలను అందించగల యాప్‌లకు భారతదేశంలో చాలా డిమాండ్ అధికంగా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం భారతదేశంలోని డిజిటల్ హెల్త్‌కేర్ మార్కెట్ 2030 నాటికి దాదాపు 37 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందని వెల్లడైంది. ప్రస్తుతం అష్నీర్ గ్రోవర్ జీరోపే యాప్ ద్వారా ఈ అతిపెద్ద వ్యాపార అవకాశంపై కన్నేసినట్లు నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications