Ashneer Grover: కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయాన్ని 'భారత్ పే' మాజీ MD అష్నీర్ గ్రోవర్ తప్పుపట్టారు. విదేశాల్లో క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చుపై 20 శాతం పన్ను విధించడంపై విమర్శలు గుప్పించారు. తాజాగా విడుదలైన ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్(TCS) నోటిఫికేషన్ పై అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ విరాళాలపై మాత్రం పన్ను తగ్గింపు బదులు పూర్తిగా రద్దు చేయడంపై మండిపడ్డారు.
"విదేశీ ప్రయాణాలపై, విదేశాల్లో క్రెడిట్ కార్డ్స్ ఖర్చుపై 20 శాతం TCS, మరియు LRS పరిమితి అనేది ఒక ఆసక్తికరమైన నిబంధన. రాజకీయ విరాళాలపై ఎప్పుడూ TCSని విధించకపోవడం గమనించాలి. ఆయా వ్యక్తులు మరియు కంపెనీలు మాత్రం ఈ విషయంలో పూర్తిగా పన్ను మినహాయింపు పొందుతాయి" ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.

అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా ఖర్చు చేసే విదేశీ మారక ద్రవ్యాన్ని సరళీకృత చెల్లింపు పథకం(LRS) కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కవర్ చేస్తుందని సంబంధిత మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్‌లో తెలిపింది. దీని కింద ఓ భారతీయుడు RBI అనుమతి లేకుండా సంవత్సరానికి గరిష్ఠంగా 2.50 లక్షల డాలర్ల వరకు మాత్రమే డబ్బును విదేశాలకు పంపవచ్చు.
2023 జూలై 1 నుంచి అమలులోకి వచ్చే విదేశీ టూర్ ప్యాకేజీలు మరియు LRS (విద్య మరియు వైద్య ప్రయోజనాల కోసం కాకుండా) కింద పంపే నిధులపై పన్నును కేంద్రం భారీగా పెంచింది. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న TCS రేట్లను పెద్ద ఎత్తున పెంచుతున్నట్లు కేంద్ర బడ్జెట్ 2023లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
అయితే పాత పన్ను విధానం ప్రకారం దేశంలో రిజిస్టర్ కాబడిన రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చే ఏ ఇండియన్ కంపెనీ అయినా ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80GGB ప్రకారం అందించిన మొత్తానికి ట్యాక్స్ తగ్గింపు క్లెయిమ్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications