ఆన్ లైన్ గేమింగ్ పై 28 శాతం GST విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇండస్ట్రీని దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాలతో సంప్రదిచిన తరువాతే ఈ డెసిషన్ తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా ఈ నిర్ణయంపై భారత్ పే సహ వ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్ తనదైన శైలిలో స్పందించారు.
తమ ప్లాట్ ఫారమ్స్ లో కస్టమర్లు లోడ్ చేసే నిధులపై కేంద్రం 28 శాతం GST విధించడంపై గ్రోవర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లి, MS ధోని, సౌరవ్ గంగూలీ సహా BCCI కూడా ఆన్‌లైన్ గేమింగ్‌ను సమర్థిస్తున్నట్లు చెప్పారు. ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్ 11ని టైటిల్ స్పాన్సర్‌గా అంగీకరించినట్లు గుర్తు చేశారు. అప్పుడు తీసుకోని ఈ నిర్ణయం ఇప్పుడెందుకు అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

'విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవాహంలా రావడాన్ని ప్రభుత్వం గతంలో సెలబ్రేట్ చేసుకుంది. రెగ్యులేటరీ రిస్క్ వల్ల ఇప్పుడు అవికాస్తా మందగిస్తాయి. ఈ ఇబ్బంది కేవలం ఆన్ లైన్ గేమింగ్ ఇండస్ట్రీకే కాక మొత్తం స్టార్టప్స్ సిస్టమ్ కు వర్తిస్తుంది. భవిష్యత్తులో అన్ని టెక్ కంపెనీలు దుబాయ్ లేదా సింగపూర్ కేంద్రంగానే పనిచేస్తాయి. రిస్క్ తీసుకుని ఇండియాలో ఆపరేట్ చేయడంలో అర్థం లేదు' అని గ్రోవర్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ నిర్ణయం ఆన్ లైన్ గేమింగ్ ఇండస్ట్రీని అంతమొందిస్తుందని అష్నీర్ తెలిపారు. యాప్ లో 100 లోడ్ చేస్తే 28 GST కింద పోతాయి. మిగిలిన 72తోనే ఆడుకోవాల్సి ఉంటుంది. ప్లాట్ ఫారమ్ ఛార్జీలకు అదనంగా 54 గెలిస్తే, మళ్లీ దానిపై 30 శాతం TDS పే చేయాల్సి ఉంటుంది. ఈ పన్నులన్నీ మినహాయించగా మిగిలిన మొత్తంతో గేమర్స్ ఎంజాయ్ చేస్తారని ప్రభుత్వం భావిస్తోందంటూ విమర్శించారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications