Multibagger Stock: ప్రముఖ ఇన్వెస్టర్ కొన్న మల్టీబ్యాగర్ స్టాక్.. ఈ రోజు కూడా రాకెట్ పరుగులు..
Multibagger Stock: గతంలో మనం బిగ్ బుల్ రాకేష్ జున్ జున్ వాలా గురించి ఎక్కువగా మాట్లాడుకునే వాళ్లం. ఎందుకంటే ఆయన మార్కెట్ల గమనంపై ఎల్లప్పుడూ బులిష్ గానే ఉండేవారు. అందుకే చాలా మంది ఆయన పెట్టుబడులను అనుకరిస్తుండేవారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది బిగ్ వేల్ ఆశిష్ కచోలియా పోర్ట్ ఫోలియో గురించి.

ఆశిష్ కచోలియా పెట్టుబడులు..
ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా తాజాగా అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. జూలై నుంచి సెప్టెంబర్- 2022 మధ్య కాలంలో కచోలియా కంపెనీలో 1 శాతం లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్న పెట్టుబడిదారుల జాబితాలో వెల్లడైంది. ప్రస్తుతం ఆయన కంపెనీలో 3,72,128 షేర్లు లేదా 2.49 శాతం వాటాను కలిగి ఉన్నారు.

మల్టీబ్యాగర్ స్టాక్..
అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ షేర్లు భారతీయ స్టాక్ మార్కెట్ లోని మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఒకటి. గత సంవత్సరం ఈ స్టాక్ రూ.332 నుంచి రూ.694 స్థాయికి చేరుకున్నాయి. అంటే ఇది దాదాపు 100 శాతం రాబడి కంటే ఎక్కువ. ఈ స్టాక్ 2022లో ప్రారంభం నుంచి ఏడాది ప్రాతిపధికన ఇన్వెస్టర్లకు 70 శాతం రాబడిని అందించింది.

రెండేళ్లలో సూపర్ రిటర్న్స్..
గత రెండేళ్ల కాలంలో ఈ స్టాక్ ఏకంగా 700 శాతం రాబడిని అందించింది. ఈ క్రమంలో స్టాక్ ధర రూ.87 నుంచి ఈ రోజు 694.25కు చేరుకుంది. ఈ స్టాక్ నేడు ఎన్ఎస్ఈలో ఉదయం 11.17 గంటల సమయంలో రూ.14.25 పెరిగింది. అయితే స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.746.20 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.310.20గా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10.38 బిలియన్లుగా ఉంది.

కంపెనీ వ్యాపారం..
1995లో స్థాపించబడిన ఈ కంపెనీలో ప్రస్తుతం 64 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కంపెనీ ఎల్పీజీ, బిటుమెన్ ను రిఫైనరీల నుంచి ఇతర కంపెనీలకు ట్రాన్స్ పోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ పెట్రో కెమికల్స్ కంపెనీ తయారీలోనూ నిమగ్నమై ఉంది. కంపెనీకి ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, షాపూర్ జీ పల్లోన్ జీ, జీపీ జైన్ వంటి ప్రఖ్యాత కంపెనీలతో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. థార్ రోడ్ల నిర్మాణంలో కంపెనీ తయారు చేసే బిటుమిన్ చాలా కీలకంగా ఉపయోగిస్తారు.


Click it and Unblock the Notifications