Sanjivani Paranteral Stock: చిన్న కంపెనీల షేర్లు చిచ్చర పిడుగుల్లా పెరుగుతూ తమ పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను అందిస్తున్నాయి. ఈ క్రమంలో మైక్రోక్యాప్ ఫార్మా కంపెనీ షేర్లపై ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా కన్నుపడింది.
ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా ఎప్పటికప్పుడు తన పోర్ట్‌ఫోలియోకి కొత్త షేర్లను జోడిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆయన కన్ను సంజీవని పేరెంటరల్ లిమిటెడ్ కంపెనీ వాటాలపై పడింది. దీంతో కంపెనీ షేర్లలో బలమైన ర్యాలీ కనిపించింది. వారాంతంలో ఇన్వెస్టర్ల ఫార్మా షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. స్టాక్ దీంతో 10 శాతం మేర ఇంట్రాడేలో లాభపడి రూ.185.45 స్థాయిని తాకింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో ఈ స్టాక్ 21% కంటే ఎక్కువ లాభపడింది.

ఆశిష్ కచోలియా జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో సంజీవని పేరెంటరల్ లిమిటెడ్ కంపెనీలో 3.70 లక్షల ఈక్విటీ షేర్లను కొన్నారు. ఇది మెుత్తం కంపెనీ వాటాల్లో 3.17 శాతానికి సమానం. వీటి ప్రస్తుతం విలువ రూ.6.70 కోట్లుగా ఉన్నాయి. కంపెనీలో ప్రమోటర్లు 27.67% వాటాను కలిగి ఉండగా.. పబ్లిక్ వాటాదారులు మిగిలిన 62.12% వాటాను హోల్డ్ చేస్తున్నారు. గత ఏడాది కాలంలో పెట్టుబడిదారులకు ఫార్మా స్టాక్ 300% పెరిగి మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. గతేడాది ఏప్రిల్ 2023లో ఒక్కో షేరు ధర రూ.45.85గా ఉంది.
ఆశిష్ కచోలియా ప్రస్తుతం తన పోర్ట్‌ఫోలియోలో రూ.2,930 కోట్ల కంటే ఎక్కువ నికర విలువతో 48 స్టాక్‌లను కలిగి ఉన్నారు. అతని ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో భాగమైన కొన్ని స్టాక్‌లలో సఫారీ ఇండస్ట్రీస్, యూనివర్సల్ ఆటోఫౌండ్రీ, బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్, రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్‌హాన్సర్, శైలీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ మొదలైనవి ఉన్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications