IPO News: మెుదటి రోజే లాభాల తుఫాను.. డబ్బులు డబుల్ చేసిన ఐపీవో..
Asarfi Hospital IPO: ప్రస్తుతం మార్కెట్లో ఐపీవోల పండుగ కొనసాగుతోంది. ఈవారం మార్కెట్లోకి వస్తున్న ఐపీవోలపై ఇన్వెస్టర్లు చాలా ఆత్రుతగా ఉన్నారు.
స్టాక్ మార్కెట్లోకి నేడు మరో కంపెనీ సూపర్ ఎంట్రీ ఇచ్చింది. లిస్టింగ్ అయిన అసర్ఫీ హాస్పిటల్ షేర్లు మెుదటి రోజే దాదాపు 100% ప్రీమియంతో BSE SME ఎక్స్ఛేంజ్‌లో అడుగుపెట్టాయి. దీని లిస్టింగ్ ధర ఒక్కో షేరుకు రూ.98.80గా ఉంది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో స్టాక్ గరిష్ఠమైన రూ.103.74ను తాకింది. అయితే కంపెనీ షేర్లను అసలు రూ.52కి విక్రయించింది. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడి ఏకంగా రెండింతలైంది.

Asarfi Hospital ఐపీవో జూలై 17న ప్రారంభమై జూలై 19, 2023న ముగిసింది. దీనికోసం ఐపీవో ప్రైస్ బ్యాండ్ విడుదల చేసిన కంపెనీ రూ.51-52గా నిర్ణయించింది. ఈ క్రమంలో కంపెనీ 51.80 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించింది. వీటి మెుత్తం విలువ రూ.26.94 కోట్లుగా ఉంది. ఐపీవోకు హేమ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా ఉండగా, కామియో కార్పొరేట్ సర్వీసెస్ IPO రిజిస్ట్రార్ గా వ్యవహరించింది.
ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.1,04,000 మెుత్తాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కో లాట్ సైజ్ 2,000 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. ఐపీవో ద్వారా సేకరించిన నిధులను కంపెనీ జార్ఖండ్‌లోని రంగూని క్యాన్సర్ ఆసుపత్రికి ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది. ఇదే క్రమంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ కోసం జార్ఖండ్‌లోని రాంచీలో లీజు ప్రాతిపదికన భూమిని పొందుతోంది.


Click it and Unblock the Notifications