Wipro Stock: కొంత కాలం నష్టాలను చూసిన తర్వాత ఇటీవలి కాలంలో దేశంలోని ఐటీ రంగంలోని లిస్టెడ్ కంపెనీల షేర్లు తిరిగి పుంజుకోవటం మెుదలెట్టాయి. మార్కెట్లు సైతం గడచిన నాలుగు ట్రేడింగ్ సెషన్ల నుంచి లాభాల్లో క్లోజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విప్రో కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు వింత అనుభవం ఏర్పడింది.
డిసెంబర్ 3న ఒక్కసారిగా తమ పోర్ట్‌ఫోలియోను చూసుకున్న విప్రో ఇన్వెస్టర్లకు ఏకంగా గుండెపోటు వచ్చినంత పనైంది. దీనికి కారణం వారి పోర్ట్ ఫోలియో విలువ అకస్మాత్తుగా సగానికి పడిపోవటమే. చాలా కాలం తర్వాత డీమ్యాట్ ఖాతాలో తమ హోల్డింగ్స్ గురించి చూసుకుందాంలే అనుకుంటూ ఓపెన్ చేసిన చాలా మంది షాక్ కి గురయ్యారు. ఒక్కసారిగా వారి పెట్టుబడి విలువ సగానికి పడిపోవటంతో ఎందుకిలా జరిగిందని చింతించాల్సిన అవసరం లేదు బ్రదర్స్. డిసెంబర్ 2న ట్రేడింగ్ ముగింపు నాటికి రూ.585 వద్ద ఉన్న షేర్ ధర తర్వాత రోజు ఒక్కోటి రూ.291.80 వద్ద ఉంది. దీనికి అసలు కారణం డిసెంబర్ 3, 2024న విప్రో స్టాక్ బోనస్ ఇష్యూ ఎక్స్-డేట్ కావటంతో స్టాక్ ధర సగానికి పడిపోయిందని నిపుణులు వెల్లడించారు.

ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను అందించటంలో టెక్ దిగ్గజం విప్రోకు పెద్ద చరిత్రే ఉంది. మరే ఇతర ఐటీ కంపెనీ ఇవ్వనన్ని సార్లు విప్రో తన పెట్టుబడిదారులను లిస్టింగ్ నుంచి ఇప్పటి వరకు రివార్డ్ చేసింది. ఈ క్రమంలోనే ఈసారి టెక్ దిగ్గజం తన పెట్టుబడిదారులకు 1:1 రేషియోలో ఉచితంగా బోనస్ షేర్లను జారీ చేసింది. దీని ప్రకారం కంపెనీ పుస్తకాల్లో ఎక్స్ డేట్ నాటికి షేర్ హోల్డర్లుగా పేర్లున్న అర్హులు కంపెనీ ప్రకటించిన ఉచిత షేర్లను డీమ్యాట్ ఖాతాల్లో అందుకుంటారు. ఉదాహరణకు మీరు 100 షేర్లను నిర్థేశించిన తేదీనాటికి కలిగి ఉంటే ప్రస్తుతం వారికి 100 షేర్లు బోనస్ రూపంలో అందించబడ్డాయి. అందువల్ల పెట్టుబడిదారుల ఖాతాల్లో దీనికి అనుగుణంగా షేర్ల సర్థుబాటు జరిగింది. అందువల్ల షేర్ల విలువ సగానికి తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. మెుత్తానికి అదే విలువకు అధిక షేర్లను ఇన్వెస్టర్లు ప్రస్తుతం దీని ప్రకారం కలిగి ఉన్నారు.
కంపెనీ బోనస్ ఇష్యూ చరిత్ర..
కంపెనీ చరిత్రను పరిశీలిస్తే 1971లో తొలిసారిగా తన పెట్టుబడిదారులకు ఉచితంగా బోనస్ షేర్లను ప్రకటించింది. ఈ క్రమంలోనే 1981-1996 మధ్యకాలంలో టెక్ దిగ్గజం దాదాపు 6 సార్లు బోనస్ షేర్లు అందించింది. దీని తర్వాత 1997, 2004, 2005, 2010, 2017, 2019 సంవత్సరాల్లో పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను రివార్డ్ చేసింది. దేశీయంగా ఉన్న ఇతర టెక్ కంపెనీలతో పోల్చితే విప్రో తన పెట్టుబడిదారులకు భారీగా రాబడిని అందించింది. సహజంగా మార్కెట్లో కంపెనీ షేర్లకు లిక్విడిటీ పెంచటానికి కంపెనీ తన పెట్టుబడిదారులకు షేర్లను రివార్డ్ చేస్తుంటాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

డెలాయిట్ 50 వేల ఉద్యోగాల ప్రకటన.. 30 వేల మందికి ఏఐపై ప్రత్యేక శిక్షణ..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications