Valentine's Day Offer: ప్రస్తుతం ఏం నడుస్తోంది అంటే ప్రేమికులకు గుడ్ టైమ్ నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాలంటైన్స్ వీక్ కొనసాగుతుండగా దానిని మరింత క్రేజీగా మార్చేందుకు విమానయాన సంస్థలు సైతం ఆఫర్ష వర్షం కురిపిస్తున్నాయి. ప్రేమికులకు మరపురాని ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఇండిగో సూపర్ ఆఫర్ ప్రకటించింది.
తాజాగా దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వాలెంటైన్స్ డే సందర్భంగా టిక్కెట్ బుక్కింగ్స్ పై 50 శాతం వరకు తగ్గింపును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కేవలం రెండు టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకేనని స్పష్టం చేసింది. ఆఫర్ కింద బుక్కింగ్స్ ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు వరకు అందుబాటులో ఉంచబడ్డాయి. బుక్కింగ్ తేదీ నుంచి ప్రయాణానికి కనీసం రెండు వారాల గడువు ఉండాలని కంపెనీ వెల్లడించింది. అంటే దాదాపు ఒక్క టిక్కెట్ ధరతోనే ఇద్దరు ప్రయాణించటానికి వెసులుబాటు కల్పించబడిందని చెప్పుకోవచ్చు.

ప్రయాణికులు తమ టిక్కెట్లను ఇండిగో వెబ్ సైట్, మెుబైల్ యాప్, ఇండిగో 6ఈ స్కై లేదా అధికారిక బుక్కింగ్ పార్ట్నర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఆఫర్ ఫిబ్రవరి 12న రాత్రి ఒంటి గంట నుంచి ఫిబ్రవరి 16న రాత్రి 23 గంటల 59 నిమిషాల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఆఫర్ కింద ఎంపిక చేసిన దేశీయ లేదా అంతర్జాతీయ రూట్లలో విమాన ప్రయాణీకులు ప్రీపెయిడ్ బ్యాగేజీ ఛార్జీలపై 15% వరకు తగ్గింపుతో పాటు స్టాండర్డ్ సీట్ల సెలక్షన్ పై 15% తగ్గింపును పొందుతారని కంపెనీ వెల్లడించింది. అలాగే ఫుడ్ ప్రీ బుక్కింగ్ పై 10 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది.
ఇందుకోసం ప్రత్యేకంగా వాలంటైన్స్ డే సందర్భంగా నిర్వహించే ఫ్లాష్ సేల్ కింద మెుదటి 500 టిక్కెట్ కొనుగోలుదారులకు వాస్తవ రుసుముపై 10 శాతం తగ్గింపును అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్ కింద తగ్గింపు కోసం వినియోగదారులు ఇండియో అధికారిక యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్ ప్రేమికుల రోజున 20 గంటల నుండి రాత్రి 23:59 గంటల వరకు చెల్లుబాటులో ఉంచుతోంది. అయితే ఆఫర్ బుక్కింగ్ తర్వాత ప్రయాణానికి 15 రోజులు గడువు ఉండాల్సిందేనని గుర్తుంచుకోండి.
ఇదే క్రమంలో ప్రత్యేక సేల్ కింద అందిస్తున్న ఇతర ప్రయోజనాలను పరిశీలిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ సేవలపై 50% వరకు తగ్గింపు కూడా అందుబాటులో ఉండబడింది. ఇది ప్రయాణీకులకు ప్రయారిటీ చెక్-ఇన్, బ్యాకేజ్ నిర్వహణలో వెసులుబాటును కల్పిస్తుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications