Onion Price: భారీగా పెరిగిన ఉల్లి ధర.. కిలో రూ.70..!
దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. గత 10 రోజుల్లో కిలో ఉల్లి రూ.30 నుంచి రూ.40 పెరిగింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్ లో కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70 పలుకుతోంది. ఉల్లి ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ అధికారులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఉల్లి ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ లోని మలక్ పేట ఉల్లి మార్కెట్ కు ఏపీలోని కర్నూల్ జిల్లా, మహారాష్ట్రలోని రైతులు ఉల్లి తీసుకొస్తుంటారు.
ఉల్లి సాగు తగ్గడంతోనే ధరలు పెరిగినట్లు వారు చెబుతున్నారు. తమకు కిలోకు రూ. 40 నుంచి రూ.50 పడుతుందని చెబుతున్నారు. అయితే ఈ ధర ఎప్పుడు ఉండదని.. సంవత్సరానికి ఒకటి రెండు సార్లు ఇలాంటి ధరలు ఉంటాయని పేర్కొంటున్నారు. మహారాష్ట్రలో ఉల్లిపంట దెబ్బ తినడంతో పాటు దిగుమతి కూడా తగ్గింది. కర్నూలు జిల్లాలో ఉల్లి ఎక్కువగా సాగు చేస్తుంటారు. కానీ సంవత్సరం తొమ్మిది వేల హెక్టార్లకే ఉల్లి సాగు పరిమితమైంది.

మే నెలలో క్వింటాల్ ఉల్లి ధర కనిష్టంగా రూ.316 ఉంటే.. గరిష్టంగా రూ.1,617 ఉండేది. ఇప్పుడు క్వింటాల్ రూ.4000కు పెరిగింది. సెప్టెంబరులో ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.4,500-రూ.5 వేల పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గతంలో ఉల్లి ధరలు పెరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే కొద్ది రోజుల క్రితం ఉల్లి ఎగుమతులపై నిబంధనలు సడలించింది. మరోవైపు ప్రభుత్వం వద్ద బఫర్ స్టాక్ లో కొంత భాగం విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో కూడా ఉల్లి ధరలు పెరిగాయి. 2019 ఉల్లి ధర క్వింటాల్ రూ.13,010 పలికిన సందర్భాలు ఉన్నాయి.
ఉల్లి ధరలు భారీగా ఉండడంతో చాలా మంది ఉల్లి వాడకాన్ని తగ్గించారు. పానీ పూరి, మిర్చి బండి వద్దు ఉల్లిపాయ వాడకం కూడా తగ్గించారు. బిర్యానీ సెంటర్ లో కూడా సలాడ్ లో ఉల్లి తగ్గించేశారు. కొన్ని ఉల్లికి బదులుగా కీర దోస, క్యారెట్ ఇస్తున్నారు. త్వరలోనే కిలో ఉల్లి రూ.100 చేరే అవకాశం ఉంది. ఉల్లి ధర పెరిగితే ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications