గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. గత 10-15 రోజులుగా పెరగని బంగారం ధర ఇవాళ ఒక్కసారిగా పెరిగింది. గత మూడు రోజుల్లో రూ.800 తగ్గిన పుత్తడి ధర తాజాగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.62,290 లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 200 పెరిగి రూ.57,100 చేరింది.
ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ తో బంగారం ధర పెరిగనట్లుగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,300 వద్దకు చేరింది.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,260 లుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,450 పెరిగింది.

ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,110 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 62,300 గా ఉంది. చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,610 ఉండగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.62,850 పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 2013 డాలర్లుగా ఉంది. హైదరాబాద్ మార్కెట్ లో వెండి కిలో ధర రూ. 1000 పెరిగి ప్రస్తుతం రూ. 77 వేలకు చేరింది.


Click it and Unblock the Notifications