Basmati Rice: కిలో రూ.150కి చేరిన బాస్మతి బియ్యం.. బిర్యానీ రేట్లు పెంచనున్న రెస్టారెంట్లు..!

దేశంలో సన్న బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మంచి రకం సన్న బియ్యం ధర కిలో రూ.80 నుంచి రూ.90 పలుకుతున్నాయి. ఎల్ నినో వస్తుందన్న నేపథ్యంలో దిగుబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే సన్న బియ్యమే రూ.90 పలుకుతుంటే.. బిర్యానీకి వాడే బాస్మతి బియ్యం ధరలు కూడా భారీగానే పలుకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ బాస్మతి బియ్యం ధ రూ.130 నుంచి రూ.150 పలుకుతున్నాయి. దీంతో బాస్మతి వడ్ల ధర కూడా భారీగానే పెరిగింది. బాస్మతి ఎక్కువగా పండించే రాష్ట్రాలలో బాసుమతి క్వింటాల్ ధర 5 వేల రూపాయలు దాటింది.

ఏడాది క్రితం 4 రూపాయలు ఉన్న ధర ఒక్కసారిగా పెరగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. బాస్మతి వరి వెరైటీలు అయిన 1509, 1121 ధరలు హర్యానాలోని కర్నాల్, పంజాబ్ లోని ఖన్నా మార్కెట్లలో క్వింటా ధర 4 వేల 500 నుంచి 5 వేల 200 రూపాయలు పలుకుతోంది. గత ఏడాదితో పోల్చితే కనీసం వెయ్యి రూపాయలు పెరిగినట్లు వివరిస్తున్నారు. మన దేశంలో 75 శాతం రకాలే వాడుతున్నట్లు చెబుతున్నారు. కాగా బాస్మతి బియ్యానికి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీగా డిమాండ్ ఉంది. గల్ఫ్ దేశాలలో డిమాండ్ కారణంగానే ఎక్కువ ధరలు పెరిగినట్లు వ్యాపారులు వివరిస్తున్నారు.

Basmati

ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈలో ఎక్కవ డిమాండ్ ఉన్నట్లు పేర్కొంటున్నారు. గల్ఫ్ లో యుద్దం కారణంగా ఈ దేశాలు ఎక్కువ శాతం నిలువలను పెంచుకునేందుకు భారీ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాయని ఆలిండియా రైస్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రసిడెంట్ రంజిత్ సింగ్ జాసన్ చెప్పారు. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6 మిలియన్ల 52 వేల టన్నుల బాస్మతి రైస్ ను ఎగమతి చేసింది. దీని విలువ దాదాపు 54 వేల కోట్ల రూపాయలుగా ఉన్నట్లు అంచనా. బియ్యం ధరలు పెరగడం వల్ల రెస్టారెంట్లలో బిర్యానీ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. బాస్మతి బియ్యం ధరలు పెరగడం, ఉల్లి ధరలు పెరగడం, అల్లం, వెల్లుల్లి ధరలు పెరగడంతో హోటల్ యాజమాన్యాలు కూడా ధరలు పెంచక తప్పడం లేదంటున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+