Tech Layoffs: ప్రపంచ వ్యాప్తంగా యువతలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా పెరుగుతున్న నిరుద్యోగిత భవిష్యత్తుపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. చాలా కాలంగా మందగమనంలో కొనసాగిన భారతీయ టెక్ పరిశ్రమలో దాగిఉన్న ప్రకంపనల ఫలితాలను టెక్కీలు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికాలో ఆర్థిక మాంద్యం రావొచ్చనే అంచనాలు ఐటీ రంగంలోని ఉద్యోగులతో పాటు ఆశావహులను భయాల్లోకి నెట్టేస్తోంది. నిన్నటి ప్రపంచ మార్కెట్ల క్రాష్ 2008 నాటి పరిస్థితులు తిరిగి రావొచ్చనే అంచనాల మధ్య టెక్కీలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. దీనికి తోడు ఇప్పటికే ఈ రంగంలో భారీగా కొనసాగుతున్న తొలగింపుల గణాంకాలు భవిష్యత్తుపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. 2023లో మెుదలైన లేఆఫ్స్ ఇప్పటికీ స్తబ్ధుగా కొనసాగుతూనే ఉండటం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత ఐటీ పరిశ్రమలోని వాస్తవ పరిస్థితులకు అద్ధం పడుతోంది. చాలా మంది టెక్ పరిశ్రమ సీనియర్ ఉద్యోగులు 2008 మార్కెట్ల క్రాష్ సమయంలో ఉద్యోగాల వేట దుర్భర పరిస్థితులను గుర్తుచేసుకుంటున్నారు.

2023లో ప్రారంభమైన టెక్ లేఆఫ్స్ ఇప్పట్లో ముగిసే సంకేతాలు కనిపించడం లేదు. వ్యాపార మందగమనంతో లాభదాయకత పెంపుపై ఫోకస్ పెట్టిన ప్రముఖ కంపెనీలు 2024లో పెద్ద ఎత్తున సిబ్బందిని తగ్గించడం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో అనేక కంపెనీలు సైలెంట్ లేఆఫ్స్ టెక్నిక్ వాడుతూ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి.
2024 జూలై చివరి నాటికి దాదాపు టెక్ పరిశ్రమ లక్ష మంది ఉద్యోగులను తొలగించింది. జూలై నెలలోనే 34 టెక్ కంపెనీలు దాదాపు 8,000 మందిని లేఆఫ్ చేశాయి. దిగ్గజ సంస్థలైన ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రధాన కంపెనీలు కూడా ఉద్యోగాల కోతను కొనసాగించాయి. ప్రపంచవ్యాప్తంగా 384 కంపెనీల నుంచి 1,24,517 మంది ఉద్యోగులు 2024లో తొలగించబడతారని తెలుస్తోంది.
ఇంటెల్ 10 బిలియన్ డాలర్లను ఆదా చేసే ప్రణాళికలో భాగంగా కంపెనీ 15 శాతం ఉద్యోగులను తగ్గిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ కూడా గత 2 నెలల్లో సుమారు 1000 మందిని తొలగించింది. అలాగే సాఫ్ట్‌వేర్ కంపెనీ UKG దాదాపు 2,200 మంది ఉద్యోగులను తొలగించింది. కాలిఫోర్నియాకు చెందిన ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ Intuit కూడా తన వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం అంటే దాదాపు 1,800 మందిని ఇంటికి పంపించింది. ఇదే క్రమంలో బ్రిటిష్, రష్యా, అమెరికా కంపెనీలు సైతం తొలగింపులు కొనసాగిస్తున్నాయి. ఇక ఇండియాలో అనేక టెక్ కంపెనీలతో పాటు స్టార్టప్ కంపెనీలు, టెక్ స్టార్టప్స్ తమ ఉద్యోగుల సంఖ్యలను క్రమంగా తగ్గిస్తూపోతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications