Stock Market: రక్షాబంధన్ రోజున స్టాక్ మార్కెట్ బంద్ ఉంటుందా? సెలవుల పూర్తి జాబితా..
Market on Rakshabandhan: రేపు అంటే ఆగస్టు 19న రక్షాబంధన్ అని మనందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు తెరచి ఉంటాయా లేక సెలవులో ఉంటాయా అనే వివరాల ప్రతి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ తప్పక తెలుసుకోవాల్సిందే. ఈ క్రమంలో మార్కెట్ల పూర్తి సెలవుల జాబితాను పరిశీలిస్తే..
ఈసారి భారతీయ స్టాక్ మార్కెట్లకు వరుస వారాంతపు సెలవుల తర్వాత సోమవారం రక్షాబంధన్ వచ్చిందని తెలిసిందే. అయితే వాస్తవానికి ఈ విషయంలో ఉన్న గందరగోళం ఏమిటంటే రక్షాబంధన్ ఆగస్టు 19న లేకపోతే ఆగస్టు 20న అన్నదే. దీనిపై క్లారిటీ కోసం BSE, NSE అధికారిక వెబ్‌సైట్‌లలో సెలవుల జాబితాను తనిఖీ చేయవచ్చు. ఆగస్ట్ 15, 2024న, 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు స్టాక్ మార్కెట్ సెలవు ఉంది.

అలాగే బీఎస్ఈ సెలవుల జాబితాను పరిశీలిస్తే ఆగస్టు మాసంలో కేవలం ఒక్కరోజు మాత్రమే ట్రేడింగ్ హాలిడే ఒక్కరోజు మాత్రమే ఉంది. అది ఆగస్టు 15, 2024 ఎందుకంటే ఆరోజు భారత స్వాతంత్ర్య దినోత్సవం కాబట్టి. దీని తర్వాత తదుపరి వ్యాపార సెలవుదినం అక్టోబర్ 2, 2024న ఉంది. అంటే ఈ సోమవారం అంటే ఆగస్టు 19న భారత స్టాక్ మార్కెట్ ఓపెన్ అవుతాయి.
గడచిన వారం భారత స్టాక్ మార్కెట్ల పనితీరును పరిశీలిస్తే.. అమెరికాలో మాంద్యం భయాలు తగ్గిన కారణంగా గ్లోబల్ మార్కెట్ల పెరుగుదల మధ్య ఐటీ స్టాక్‌లలో కొనుగోలు కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం పెద్ద లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1,331 పాయింట్ల జంప్‌తో రెండు వారాల గరిష్ఠ స్థాయి వద్ద ముగియగా, నిఫ్టీ 397 పాయింట్లు పెరిగి 24,500 మార్క్‌కు పైన ట్రేడింగ్ ముగించింది. దీంతో మార్కెట్లు గడచిన రెండు నెలల్లో అత్యద్భుతమైన ట్రేడింగ్ పనితీరును శుక్రవారం చూశాయి.


Click it and Unblock the Notifications