Vijay Shekhar Sharma: ఫిన్ టెక్ స్టార్టప్ పేటీఎం పేమెంట్స్ మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తన ఐపీవోను 2021లో మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై పెద్ద వివాదం నెలకొంది.
వివరాల్లోకి వెళితే పేటీఎం ఐపీవో సమయంలో కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, ఆ సమయంలో పనిచేసిన బోర్డు సభ్యులకు వాస్తవాలను తప్పుగా చూపించినందుకు మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రమోటర్ వర్గీకరణ నిబంధనలను శర్మ పాటించలేదని తన నోటీసులో పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను పరిశీలించిన ఆర్బీఐ ఇన్‌పుట్‌ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించబడినట్లు విషయం గురించి తెలిసిన వ్యక్తులు వెల్లడించారు.

వాస్తవానికి ఐపీవో తర్వాత ESOPలను స్వీకరించకుండా ప్రమోటర్లను సెబీ నిబంధనలు నిషేధించినందున, లిస్టింగ్ తర్వాత శర్మ ఉద్యోగుల స్టాక్ ఆప్షన్‌లకు అనర్హులు. ప్రస్తుతం శర్మను ప్రమోటర్‌గా వర్గీకరించాలని సెబీ అభిప్రాయాన్ని తీసుకుంటోంది. వ్యవస్థాపకుడు చేసిన క్లెయిమ్‌ల ఖచ్చితత్వాన్ని ధృవీకరించడం కంపెనీ బోర్డు సభ్యుల విశ్వసనీయ బాధ్యత కూడా. ఒక కంపెనీ తనను తాను 'వృత్తిపరంగా నిర్వహించేది'గా వర్గీకరించకపోతే, అన్ని లిస్టెడ్ కంపెనీలు సాధారణంగా ప్రమోటర్ నడిచేవిగా భావించబడతాయి. వృత్తిపరంగా నిర్వహించబడే వర్గీకరణకు కంపెనీ అర్హత పొందాలంటే దాని వాటాదారుల్లో ఎవరూ కంపెనీలో 10 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండకూడదు. అలాగే ఏ ఒక్క వాటాదారు కూడా నియంత్రణను కలిగి ఉండకూడదు.
అయితే ఇక్కడ పేటీఎం విషయంలో.. కంపెనీ ఐపీవో పత్రాన్ని దాఖలు చేయటానికి ముందు వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తన వాటాలో 5 శాతం VSS హోల్డింగ్స్ ట్రస్ట్ అనే కుటుంబ ట్రస్ట్‌కు బదిలీ చేశారు. ఈ బదిలీకి ముందు శర్మ వన్ 97 కమ్యూనికేషన్‌లో 14.6 శాతం కలిగి ఉన్నారు. ఈ చర్య తర్వాత శర్మ వాటా 9.6 శాతానికి తగ్గింది. నిబంధనలలో పేర్కొన్న 10% థ్రెషోల్డ్ కంటే తక్కువ. అయితే దీనికి అదనంగా శర్మ కంపెనీ బోర్డులో ఉండటం, కంపెనీని నడిపించడం ద్వారా కొంత నియంత్రణను కలిగి ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆఫర్ డాక్యుమెంట్ ప్రకారం VSS హోల్డింగ్స్ ట్రస్ట్ పూర్తిగా శర్మ యాజమాన్యంలో ఉంది. కానీ మునుపటి మీడియా ప్రకటనల్లో ట్రస్ట్ కలిగి ఉన్న 5 శాతం వాటాపై శర్మకు నియంత్రణ లేదని కంపెనీ పేర్కొంది.
అయితే ఈ వ్యవహారంపై సెబీ కంపెనీ లిస్టింగ్ జరిగిన మూడేళ్ల తర్వాత చర్యలు ప్రారంభించటం కీలకంగా మారింది. 2021లో ఆఫర్ డాక్యుమెంట్‌ను ఫైల్ చేసినప్పటి నుంచి సెబీకి షేర్‌హోల్డింగ్ ఏర్పాటు గురించి తెలుసు. నిజానికి ఆ తర్వాత ప్రాక్సీ అడ్వైజరీ సంస్థలు కూడా ఇష్యూపై రెడ్ ఫ్లాగ్ చేశాయి. కానీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ కఠిన చర్యల తర్వాత మాత్రమే సెబీ చర్య ప్రారంభించింది. అయితే ఈ వార్త నేడు బయటకు రావటంతో స్టాక్ మార్కెట్లలో పేటీఎం స్టాక్ 9 శాతం కుప్పకూలింది. సాయంత్రం 3.21 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో స్టాక్ ధర 4.42 శాతం క్షీణించి రూ.530 స్థాయి వద్ద కొనసాగుతోంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications