Stock Market: భారత మార్కెట్లలో జోరు.. బిగ్ టెక్నికల్ బ్రేకౌట్ రెడీ.. IT స్టాక్స్ ఢమాల్
Market Rally: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాల పరంపరను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఉదయం గిఫ్ట్ నిఫ్టీ ఇచ్చిన పాజిటివ్ సంకేతాలతో దేశీయ మార్కెట్లలో ర్యాలీ ఊపందుకుంది.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 338 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 116 పాయింట్ల మేర లాభంలో ముందుకు కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 299 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 375 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఈ క్రమంలో క్యూ3 ఫలితాలను నిన్న సాయంత్రం ప్రకటించిన కొన్ని కంపెనీల షేర్లు మాత్రం ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.

US మార్కెట్‌లో ఓవర్‌నైట్ లాభాలకు తోడు ఇతర ఆసియా మార్కెట్ల పెరుగుదల ప్రారంభ ట్రేడ్‌లలో స్థానిక బెంచ్‌మార్క్ సూచీల ర్యాలీకి నేడు సహాయపడింది. ఇక్కడ సానుకూలమైన మరో అంశం ఏమిటంటే నిఫ్టీ సూచీ సాంకేతికంగా మెరుగైన స్థితిలో ఉన్నట్లు చార్ట్స్ చూపిస్తున్నాయి. ఇప్పటికే ఇండెక్స్ రోజువారీ చార్ట్‌లలో భారీ బ్రేక్‌అవుట్‌ను సూచిస్తోంది. అలాగే ఆసియా మార్కెట్లు సానుకూల సంకేతాలను అందించటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తున్నారు.
NSEలో బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, టైటాన్, దివీస్ ల్యాబ్, ఎస్బీఐ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా కన్జూమర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ముందుకు సాగుతున్నాయు.
ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, యూపీఎల్, విప్రో, బీపీసీఎల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, ఓఎన్జీసీ, మారుతీ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications