భారత ఫారెక్స్ నిల్వలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. మే 28వ తేదీతో ముగిసిన వారాంతానికి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 59,816 కోట్ల డాలర్లుగా మోదయ్యాయి. ప్రస్తుతం డాలర్-రూపాయి మారకం రేటు ప్రకారం ఇది దాదాపు రూ.43.60 లక్షల కోట్లకు సమానం. ఫారెక్స్ నిల్వల్లో యూరో, యెన్, ఫౌడ్ వంటి డాలరేతర కరెన్సీల మారకం రేటు పెరగడం ఇందుకు కలిసి వచ్చింది.
ద్రవ్య పరపతి విధాన సమీక్ష వివరాలను ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పిన 60,000 కోట్ల డాలర్ల కంటే ఈ నిల్వలు కాస్త తక్కువ. మే 21వ తేదీతో ముగిసిన వారాంతానికి ఫారెక్స్ నిల్వలు 527 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. అత్యధిక ఫారెక్స్ నిల్వలు కలిగి ఉన్న దేశాల్లో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో రష్యా ఇటీవలే అయిదో స్థానానికి పడిపోయింది.

భారత ఆర్థిక వ్యవస్థలోకి 600 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, ఇందులో ఈ సంవత్సరమే 105 బిలియన్ డాలర్లు పెరిగాయని చెబుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలోకి పెద్ద ఎత్తున లిక్విడిటీ జొప్పించడం కలిసి వచ్చిందని చెబుతున్నారు. మే నెలలో ఎన్ఎస్ఈలో రోజువారీ సగటు టర్నోవర్ రూ.79,000 కోట్లు. అదే సమయంలో 2020 మే నెలలో రూ.65,000 కోట్లు, 2019లో రూ.36,000 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications